Telugu Global
Cinema & Entertainment

మొత్తానికి నితిన్ సాధించాడు...

 ఏ లక్ష్యంతో అయితే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టాడో… ఆ టార్గెట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఛేజ్ చేస్తున్నాడు నితిన్. ఇన్నాళ్లూ చేసిన సినిమాలు ఒకెత్తయితే… కేవలం త్రివిక్రమ్ తో చేసిన ఈ ఒక్క సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో నితిన్ కంటే త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారంటే… సినిమాపై నితిన్ ఎంత స్కోప్ పెట్టుకున్నాడో అర్థంమౌతుంది. ఆ ఆశలకు అనుగుణంగానే అ..ఆ సినిమా రఫ్పాడిస్తోంది. లోకల్ గానే కాకుండా ఓవర్సీస్ లో కూడా నితిన్ […]

మొత్తానికి నితిన్ సాధించాడు...
X
ఏ లక్ష్యంతో అయితే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టాడో… ఆ టార్గెట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఛేజ్ చేస్తున్నాడు నితిన్. ఇన్నాళ్లూ చేసిన సినిమాలు ఒకెత్తయితే… కేవలం త్రివిక్రమ్ తో చేసిన ఈ ఒక్క సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో నితిన్ కంటే త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారంటే… సినిమాపై నితిన్ ఎంత స్కోప్ పెట్టుకున్నాడో అర్థంమౌతుంది. ఆ ఆశలకు అనుగుణంగానే అ..ఆ సినిమా రఫ్పాడిస్తోంది. లోకల్ గానే కాకుండా ఓవర్సీస్ లో కూడా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో తొలిసారిగా మిలియన్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు నితిన్. మిలియన్ డాలక్ ఏం ఖర్మ… ఏకంగా 2 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. అవును… తాజా షోలతో కలుపుకుంటే… నితిన్ నటించిన అ..ఆ సినిమా ఓవర్సీస్ లో 2మిలియన్ డాలర్లు ఆర్జించింది. బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ఈ విషయాల్ని ప్రకటించాడు. ఎవరీ నితిన్… ఏంటి ఈ సినిమా క్రేజ్ అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తంచేశాడు. మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమా లెక్కలు సవరించింది. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏపీ, తెలంగాణలో కలిపి ఇప్పటివరకు 24కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరో వీకెండ్ కూడా అ..ఆ సినిమానే థియేటర్లలో రాజ్యమేలే పరిస్థితి కనిపిస్తోంది.
First Published:  12 Jun 2016 1:46 AM GMT
Next Story