Telugu Global
Cinema & Entertainment

కమల్ హీరోయిన్ తో సిద్దార్థ్ రొమాన్స్ 

తెలుగు తెరకు బాయ్స్ సినిమాతో పరిచయమై…. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన సిద్ధార్థ్… ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈమధ్య కొన్ని ప్రయోగాత్మక సినిమాలతో తెలుగుతెరపైకి వచ్చినప్పటికీ… సిద్దార్థ్ ను టాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈసారి మరోసారి తెలుగుతెరపై తన దండయాత్ర షురూ చేశాడు సిద్ధూ. మరో త్రిభాషా చిత్రంతో దూసుకురావటానికి రంగం సిద్ధం చేశాడు. వయాకామ్-18 మరియు ఈటాకీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా […]

కమల్ హీరోయిన్ తో సిద్దార్థ్ రొమాన్స్ 
X
తెలుగు తెరకు బాయ్స్ సినిమాతో పరిచయమై…. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన సిద్ధార్థ్… ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈమధ్య కొన్ని ప్రయోగాత్మక సినిమాలతో తెలుగుతెరపైకి వచ్చినప్పటికీ… సిద్దార్థ్ ను టాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈసారి మరోసారి తెలుగుతెరపై తన దండయాత్ర షురూ చేశాడు సిద్ధూ. మరో త్రిభాషా చిత్రంతో దూసుకురావటానికి రంగం సిద్ధం చేశాడు. వయాకామ్-18 మరియు ఈటాకీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న సినిమాలో సిద్ధార్థ హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని సిద్ధార్థ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. ‘ది హౌస్ నెక్ట్స్ డోర్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తారని తెలియజేశాడు. అలాగే ఈ సినిమాలో వివిధ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటులు నటించనున్నారని, హీరోయిన్ గా ఆండ్రియా నటిస్తుందని పేర్కొన్నాడు. గతంలో కమల్ సరసన ఈ భామ హీరోయిన్ గా నటించింది. చివరగా ఈ త్రిభాషా సినిమా షూటింగ్ ఆగష్టులో మొదలవుతుందని, సినిమా ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నట్టు ప్రకటించాడు సిద్ధూ. ఈసారైనా సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ఆశిద్దాం.
First Published:  12 Jun 2016 1:43 AM GMT
Next Story