Telugu Global
NEWS

హీరో మంచివాడు, చంద్రబాబూ 14వ రీల్‌ వరకు నీదే పైచేయి!- జగన్‌

పార్టీ కార్యకర్తలపై అధికారపార్టీ దాడులు, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా అనంతపురం ఎస్పీ కార్యాలయం ముందు వైఎస్ జగన్ ధర్నా నిర్వహించారు. ధర్నాకు భారీగా జనం,కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ .. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరును సినిమాలో విలన్‌ పాత్రతో పోల్చి వివరించారు జగన్. సినిమాకు వెళ్లి విలన్ పాత్ర చూస్తే చంద్రబాబే గుర్తుకు వస్తారన్నారు. సినిమాలో హీరో మంచివాడు, అమాయకుడిగా ఉంటాడని అందుకే అన్ని సవ్యంగా చేసుకుంటూ వెళ్తాడని చెప్పారు. విలన్ […]

హీరో మంచివాడు, చంద్రబాబూ 14వ రీల్‌ వరకు నీదే పైచేయి!- జగన్‌
X

పార్టీ కార్యకర్తలపై అధికారపార్టీ దాడులు, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా అనంతపురం ఎస్పీ కార్యాలయం ముందు వైఎస్ జగన్ ధర్నా నిర్వహించారు. ధర్నాకు భారీగా జనం,కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ .. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరును సినిమాలో విలన్‌ పాత్రతో పోల్చి వివరించారు జగన్.

సినిమాకు వెళ్లి విలన్ పాత్ర చూస్తే చంద్రబాబే గుర్తుకు వస్తారన్నారు. సినిమాలో హీరో మంచివాడు, అమాయకుడిగా ఉంటాడని అందుకే అన్ని సవ్యంగా చేసుకుంటూ వెళ్తాడని చెప్పారు. విలన్ మాత్రం ఇష్టానుసారం చేసుకుంటూ 14వ రీల్ వరకు పైచేయిగానే ఉంటాడన్నారు. ఆ తరహాలోనే చంద్రబాబుది కూడా 14వ రీల్ వరకు పైచేయిగా ఉంటుందన్నారు. కానీ 14వ రీల్‌కు రాగానే కథ అడ్డం తిరుగుతుందని … విలన్ జైలుకు వెళ్తాడని చంద్రబాబును ఉద్దేశించి జగన్ అన్నారు.

ప్రత్యేకహోదాపై మోదీకి అల్టిమేటం ఇస్తే రెండేళ్లలో తాను చేసిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారన్నభయంతోనే చంద్రబాబు నోరుమెదపడం లేదని జగన్ విమర్శించారు. ఓటుకు నోటుకేసులో ”బ్రీఫ్డ్‌ మీ” టేపులను బయటకు తీస్తారన్న భయంతోనే ఎగువున కేసీఆర్‌ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన బలపడిపోతాం అన్న చంద్రబాబు ఆలోచన తప్పన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిన చోట ప్రజలే మరో బలమైన నాయకుడిని తయారు చేసుకుంటారని చెప్పారు.

వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను జగన్ ఖండించారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలన్నారు. జీతాలు ఇస్తున్నది ప్రభుత్వమని చంద్రబాబు కాదన్న విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. న్యాయాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని కోరారు. కార్యకర్తలను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డిపై హత్యాయత్నం చేశారంటే ఇక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు జగన్. మొత్తం మీద జగన్ ధర్నాకు భారీగానే కార్యకర్తలు, జనం తరలివచ్చారు.

Click on Image to Read:

jagan-anantapur

ysrcp-anantapu-rally

YS-Jagan

nara-lokesh-twitter

chandrababu

gutta

mla-attar-basha

chandrababu-naidu

ys-jagan-yatra

anam-vivekananda-reddy-comm

gutta-sukender-reddy

telangana-congress

tdp

dl-ravindra-reddy

CPM-Ramakrishna

ntr-chandrababu-naidu

First Published:  5 Jun 2016 9:29 AM GMT
Next Story