Telugu Global
Cinema & Entertainment

మెగా హీరోను దాటేస్తున్న నితిన్

మెగా ఫ్యాన్స్ కాస్త బాధపడాల్సిన విషయం ఇది. ఇక తెలంగాణ మెగాస్టార్ నితిన్ ఫ్యాన్స్ ఆనందించాల్సిన విషయం కూడా ఇదే. అవును… తన తాజా సినిమాతో నితిన్.. మెగాహీరో రామ్ చరణ్ ను అధిగమించడానికి రెడీ అయిపోయాడు. ఈ వీకెండ్ గడిస్తే… రామ్ చరణ్ ను నితిన్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో ఇలా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు నితిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ హీరో చేసిన అ..ఆ సినిమా తాజాగా విడుదలైంది. విదేశాల్లో కేవలం […]

మెగా హీరోను దాటేస్తున్న నితిన్
X
మెగా ఫ్యాన్స్ కాస్త బాధపడాల్సిన విషయం ఇది. ఇక తెలంగాణ మెగాస్టార్ నితిన్ ఫ్యాన్స్ ఆనందించాల్సిన విషయం కూడా ఇదే. అవును… తన తాజా సినిమాతో నితిన్.. మెగాహీరో రామ్ చరణ్ ను అధిగమించడానికి రెడీ అయిపోయాడు. ఈ వీకెండ్ గడిస్తే… రామ్ చరణ్ ను నితిన్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో ఇలా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు నితిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ హీరో చేసిన అ..ఆ సినిమా తాజాగా విడుదలైంది. విదేశాల్లో కేవలం బుధ, గురు వారాల వసూళ్లే దాదాపు 50వేల డాలర్లు వచ్చాయి. ఈ వీకెండ్ వసూళ్లు కూడా కలుపుకుంటే నితిన్ సినిమా కచ్చితంగా లక్ష డాలర్లు వసూలు చేస్తుంది. మరోవైపు టోటల్ రన్ లో అ.. ఆ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు రామ్ చరణ్ కు మాత్రం ఓవర్సీస్ లో సరైన ట్రాక్ రికార్డు లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో చెర్రీ చేసిన గోవిందుడు అందరివాడేలే సినిమా మాత్రం ఓ మోస్తరుగా ఓవర్సీస్ లో ఆడింది. ఆ సినిమాకు దాదాపు 6లక్షల 70వేల డాలర్లు వచ్చాయి. ఆ ఫిగర్ ను క్రాస్ చేయడం నితిన్ కు పెద్ద కష్టమేం కాదని ట్రేడ్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. మరోవైపు తాజాగా చెర్రీ సినిమా బ్రూస్ లీ సినిమా ఆమాత్రం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. సో…. ఓవర్సీస్ లో చెర్రీని క్రాస్ చేసి అరుదైన రికార్డు సృష్టించాలనుకుంటున్నాడు నితిన్.
First Published:  3 Jun 2016 11:30 PM GMT
Next Story