Telugu Global
NEWS

జగన్.. నేను తలుచుకుంటే..!

సీఎం చంద్రబాబుపై జేసీ బ్రదర్స్ ఈగ వాలనివ్వడం లేదు. తాజాగా ప్రజలను నవనిర్మాణ దీక్ష పేరుతో మోసం చేస్తున్న చంద్రబాబును జనం చెప్పుతో కొట్టాలని జగన్ పిలుపునివ్వడంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రస్తుతం తాడిపత్రిలోనే రైతు భరోసా యాత్ర చేస్తున్న నేపథ్యంలో తాను తలుచుకుంటే జగన్‌ను తాడిపత్రి నుంచి తరిమేయగలనని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ”చంద్రబాబును కాదు నిన్నే ప్రజలు చెప్పులతో కొట్టి ఊరేగించేకాలం దగ్గపడింది. […]

జగన్.. నేను తలుచుకుంటే..!
X

సీఎం చంద్రబాబుపై జేసీ బ్రదర్స్ ఈగ వాలనివ్వడం లేదు. తాజాగా ప్రజలను నవనిర్మాణ దీక్ష పేరుతో మోసం చేస్తున్న చంద్రబాబును జనం చెప్పుతో కొట్టాలని జగన్ పిలుపునివ్వడంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రస్తుతం తాడిపత్రిలోనే రైతు భరోసా యాత్ర చేస్తున్న నేపథ్యంలో తాను తలుచుకుంటే జగన్‌ను తాడిపత్రి నుంచి తరిమేయగలనని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ”చంద్రబాబును కాదు నిన్నే ప్రజలు చెప్పులతో కొట్టి ఊరేగించేకాలం దగ్గపడింది. నేననుకుంటే ఈ క్షణమే నిన్ను ప్రజలతో చెప్పులతో కొట్టిస్తా ఏం చేస్తావ్. పది నిమిషాల్లో ఆ పని చేయించగలను”అని ప్రభాకర్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా రెచ్చిపోయి మాట్లాడడం ఇది మొదటిసారికాదు. గతంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపైనా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ప్రభాకర్ రెడ్డి. ”రఘువీరారెడ్డి ఇంటికి వెళ్లి బట్టలూడదీసి తంతా” అని అప్పట్లో వ్యాఖ్యానించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు కూడా తీసుకుంటానని మరోసారి చెప్పి కలకలం రేపారు. ఇటీవల పదేపదే చంద్రబాబు విషయంలో జేసీ సోదరులు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇందుకు కారణం అనంతపురం రాజకీయాలేననిచెబుతున్నారు. జేసీ బ్రదర్స్ టీడీపీలో ఉన్నప్పటికీ మిగిలిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా వీరికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో వీరికి పెద్ద వివాదమేనడుస్తోంది. ఈనేపథ్యంలో జేసీ సోదరులు పదేపదే చంద్రబాబును ఆకాశానికెత్తేస్తున్నారని భావిస్తున్నారు.

Click on Image to Read:

muddu-krishnama-naidu

renuka-chowdary

KE-Prabhakar

babu-purandeshwari

damodar-raja-narasimha

ashok-gajapati-raju

jagadish-reddy

komatireddy

d-srinivas-rapolu-ananda-bh

revanth-kcr

dgp-ramudu-paritala-sriram

First Published:  2 Jun 2016 11:57 PM GMT
Next Story