Telugu Global
Cinema & Entertainment

ఈరోజే విడుదలైంది... అప్పుడే రికార్డు...

ఈరోజు విడుదలైన అ..ఆ సినిమాకు సంబంధించి హీరో నితిన్ అప్పుడే ఓ రికార్డు సృష్టించాడు. శాటిలైట్ రైట్స్ విషయంలో ఈ రికార్డు స్థాపించిన నితిన్.. గతంలో తను నెలకొల్పిన రికార్డునే తిరగరాశాడు. భారీ సినిమాల్ని దక్కించుకోవడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న జీ-తెలుగు ఛానెల్… నితిన్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఆ..ఆ సినిమా రైట్స్ ను కూడా భారీ మొత్తానికే కొనేసింది. ఏకంగా ఈ సినిమా కోసం ఆ ఛానెల్… 6కోట్ల రూపాయలు ఖర్చు పట్టిందని సమాచారం. గతంలో నితిన్ […]

ఈరోజే విడుదలైంది... అప్పుడే రికార్డు...
X
ఈరోజు విడుదలైన అ..ఆ సినిమాకు సంబంధించి హీరో నితిన్ అప్పుడే ఓ రికార్డు సృష్టించాడు. శాటిలైట్ రైట్స్ విషయంలో ఈ రికార్డు స్థాపించిన నితిన్.. గతంలో తను నెలకొల్పిన రికార్డునే తిరగరాశాడు. భారీ సినిమాల్ని దక్కించుకోవడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న జీ-తెలుగు ఛానెల్… నితిన్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఆ..ఆ సినిమా రైట్స్ ను కూడా భారీ మొత్తానికే కొనేసింది. ఏకంగా ఈ సినిమా కోసం ఆ ఛానెల్… 6కోట్ల రూపాయలు ఖర్చు పట్టిందని సమాచారం. గతంలో నితిన్ నటించిన ఏ సినిమా ఇంత మొత్తానికి అమ్ముడుపోలేదు. ఈ సెగ్మెంట్ లో నితిన్ సృష్టించిన రికార్డు ఇప్పటివరకు కేవలం 4కోట్ల రూపాయలు మాత్రమే. అదే గొప్ప అనుకుంటున్న టైమ్ లో… త్రివిక్రమ్ పుణ్యాన అ..ఆ సినిమాకు ఏకంగా 6కోట్ల రూపాయల మార్కెట్ పలికింది. సినిమా విడుదలకు ముందే ఇంత పెద్ద ఆఫర్ రావడంతో… సినిమా విజయంపై ఆ..ఆ టీం పూర్తి నమ్మకంతో ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను ఓవర్సీస్ లో ఏకంగా 2వందలకు పైగా తెరలపై ప్రదర్శిస్తున్నారు. నితిన్ కెరీర్ లో ఇది కూడా ఓ రికార్డే. ఆనంద్ విహారిగా నితిన్, అనసూయ రామలింగంగా సమంత నటించిన ఈ సినిమా ట్రయిలర్స్ కు ఇప్పటికే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిన ఆ..ఆ మూవీ శాటిలైట్ రైట్స్ లో ఇప్పటికే రికార్డు సృష్టించగా… థియేటర్లలో ఏ మేరకు రాణిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
Click on Image to Read:
A..-Aa-Movie-review
pawan
sai-dharam-tej-regina
kalyan-ram
First Published:  1 Jun 2016 10:40 PM GMT
Next Story