Telugu Global
Cinema & Entertainment

కృష్ణా జిల్లాకు కిక్ ఇచ్చిన బన్నీ

కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతాయో తెలీదు. కొన్ని ప్రాంతాల్లో సినిమాలు ఇట్టే ఆడేస్తాయి. దీనికి పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ సరైనోడు సినిమా. ఫ్లాప్ అనుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తెగ ఆడింది. ఏకంగా 70కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. సరే.. ఈ విషయం పక్కనపెడితే… కృష్ణా జిల్లా వాసులకు సరైనోడు సినిమా మాంచి కిక్ ఇచ్చినట్టుంది. ఆ సినిమాను ఏ రాష్ట్రంలో ఏ జిల్లా వాసులు చూడనంత ఎక్కువగా కృష్ణా జిల్లా ప్రజలు చూశారు. ఇంకా […]

కృష్ణా జిల్లాకు కిక్ ఇచ్చిన బన్నీ
X
కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతాయో తెలీదు. కొన్ని ప్రాంతాల్లో సినిమాలు ఇట్టే ఆడేస్తాయి. దీనికి పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ సరైనోడు సినిమా. ఫ్లాప్ అనుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తెగ ఆడింది. ఏకంగా 70కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. సరే.. ఈ విషయం పక్కనపెడితే… కృష్ణా జిల్లా వాసులకు సరైనోడు సినిమా మాంచి కిక్ ఇచ్చినట్టుంది. ఆ సినిమాను ఏ రాష్ట్రంలో ఏ జిల్లా వాసులు చూడనంత ఎక్కువగా కృష్ణా జిల్లా ప్రజలు చూశారు. ఇంకా చూస్తున్నారు. ఊర మాస్ సినిమాలంటే తమకు ఎంతిష్టమో మరోసారి నిరూపించుకున్నారు. నిజానికి గుంటూరులో రికార్డు సృష్టిస్తుందనుకున్న సరైనోడు సినిమా కృష్ణాలో రికార్డులు సృష్టించింది. ఆ జిల్లాలో 4కోట్ల షేర్ సంపాదించిన సినిమాల్లో ఒకటిగా సరైనోడునిలిచింది. కృష్ణా జిల్లాలో 4కోట్లు షేర్ సంపాదించిన సినిమాలు రెండే ఉన్నాయి. ఒకటి రాజమౌళి తీసిన బాహుబలి కాగా.. రెండోది మహేష్ నటించిన శ్రీమంతుడు. ఇప్పుడు మూడో సినిమాగా బన్నీ నటించిన సరైనోడు నిలిచింది. కేవలం 39 రోజుల్లో ఈ సినిమా ఈ ఘనత సాధించింది. మరీ ముఖ్యంగా వసూళ్లు పడిపోయే సోమవారం రోజున ఈ రికార్డు సాధించడం మరీ గొప్ప విషయం అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.
First Published:  31 May 2016 11:20 PM GMT
Next Story