Telugu Global
Cinema & Entertainment

ఈ దర్శకుడు కూడా విలన్ అయిపోయాడు

హీరోలు విలన్లుగా మారడం ఇప్పుడు రొటీన్ అయిపోయింది. జగపతిబాబు ఈమధ్యే విలన్ గా మారాడు. ఓ తమిళ సినిమాతో అరవింద్ స్వామి కూడా విలన్ అవతారం ఎత్తాడు. తాజాగా సూర్య కూడా తన సినిమాలోనే విలన్ గా నటించాడు. వీళ్లంతా విలన్లుగా మారడం రొటీన్. ఇప్పుడు దర్శకులు కూడా విలన్లుగా మారిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య త్వరలోనే విలన్ గా ముఖానికి రంగేసుకోబోతున్నాడు. మహేష్-మురుగదాస్ సినిమాలో విలన్ గా నటించడానికి ఎస్ జే సూర్య […]

ఈ దర్శకుడు కూడా విలన్ అయిపోయాడు
X
హీరోలు విలన్లుగా మారడం ఇప్పుడు రొటీన్ అయిపోయింది. జగపతిబాబు ఈమధ్యే విలన్ గా మారాడు. ఓ తమిళ సినిమాతో అరవింద్ స్వామి కూడా విలన్ అవతారం ఎత్తాడు. తాజాగా సూర్య కూడా తన సినిమాలోనే విలన్ గా నటించాడు. వీళ్లంతా విలన్లుగా మారడం రొటీన్. ఇప్పుడు దర్శకులు కూడా విలన్లుగా మారిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య త్వరలోనే విలన్ గా ముఖానికి రంగేసుకోబోతున్నాడు. మహేష్-మురుగదాస్ సినిమాలో విలన్ గా నటించడానికి ఎస్ జే సూర్య ఒప్పుకున్నాడు. ఓ వైపు పవన్ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు మహేష్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తాడు ఎస్ జే సూర్య. ఇప్పుడీ బాటలోకి మరో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేస్తున్నాడు గౌతమ్ మీనన్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… ధనుష్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు తను దర్శకత్వం వహించడంతోపాటు ఇందులో తనే విలన్ గా కూడా కనిపించడానికి సిద్ధమౌతున్నాడు. తన సినిమాలో గౌతమ్ మీనన్ విలన్ గా కనిపించడానికి ధనుష్ కూడా ఒప్పుకున్నాడు.
First Published:  21 May 2016 12:23 AM GMT
Next Story