Telugu Global
Cinema & Entertainment

అక్కడ మాత్రం ఆపుకోలేకపోయాడు...

చాలా విషయాల్లో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆహార నియమాల విషయంలో ప్రభాస్ అంత కఠినంగా ఎవరూ ఉండరని ఇండస్ట్రీలోనే చాలా మంది ఒప్పుకుంటారు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీని అంతా తింటుంటే ప్రభాస్ మాత్రం ఒక్క మెతుకు కూడా ముట్టలేదని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. అంతేకాదు… ఒకే టేబుల్ పై అందరికీ స్వయంగా ప్రభాసే బిర్యానీ వడ్డించి, తను మాత్రం క్యాబేజీ ఆకులు తింటూ కూర్చునేవాడని […]

అక్కడ మాత్రం ఆపుకోలేకపోయాడు...
X
చాలా విషయాల్లో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆహార నియమాల విషయంలో ప్రభాస్ అంత కఠినంగా ఎవరూ ఉండరని ఇండస్ట్రీలోనే చాలా మంది ఒప్పుకుంటారు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీని అంతా తింటుంటే ప్రభాస్ మాత్రం ఒక్క మెతుకు కూడా ముట్టలేదని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. అంతేకాదు… ఒకే టేబుల్ పై అందరికీ స్వయంగా ప్రభాసే బిర్యానీ వడ్డించి, తను మాత్రం క్యాబేజీ ఆకులు తింటూ కూర్చునేవాడని కూడా చెప్పుకొచ్చాడు. డైట్ విషయంలో అంత నిక్కచ్చిగా ఉండే ప్రభాస్, ఒకే ఒక్క దగ్గర మాత్రం ఆపుకోలేకపోయాడు. అదే అమ్మ చేతివంట. ఎన్ని నియమాలైనా పాటిస్తాను కానీ అమ్మ చేతివంట తినకుండా మాత్రం ఉండలేనని ప్రభాస్ స్పష్టంచేశాడు. మరీ ముఖ్యంగా భీమవరం స్టయిల్ లో అమ్మ చేసే మిక్స్ డ్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని… ఆరోజు మాత్రం కడుపునిండా బిర్యానీ తినేస్తానని… మరుసటి రోజు జిమ్ లో ఇంకాస్త ఎక్కువ సమయం కసరత్తులకు కేటాయిస్తానని ప్రకటించాడు. అయితే మిక్స్ డ్ బిర్యానీతో పాటు తనకు ఫ్రూట్ ఎక్సోటికా అనే ఐస్ క్రీమ్ రకమంటే కూడా చాలా ఇష్టమంటున్నాడు ప్రభాస్. కానీ ఒక్కోసారి ఐస్ క్రీమ్ తినకుండా కంట్రోల్ చేసుకుంటాను కానీ… అమ్మ చేసిన బిర్యానీ మాత్రం వదలనని అంటున్నాడు.

Click on Image to Read:

kajal-agarwal

mahesh

YS-Jagan

wife-swap

First Published:  17 May 2016 12:28 AM GMT
Next Story