Telugu Global
Cinema & Entertainment

బేస్ కోసం బన్నీ ప్రయత్నం

మొన్నటివరకు లింగుస్వామికి అవకాశమిస్తాడా.. లేక విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడా అనే అనుమానం ఉండేది. ఫైనల్ గా బన్నీ ప్రాజెక్టులపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ అల్లువారబ్బాయి ఇద్దరు దర్శకులకు అవకాశమిచ్చాడు. అయితే మొదట లింగుస్వామితోనే సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకొచ్చాయి. తమిళ-తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. అంటే.. బన్నీ చేయబోతున్న స్ట్రయిట్ తమిళ సినిమా ఇదేనన్నమాట. ఆ […]

బేస్ కోసం బన్నీ ప్రయత్నం
X
మొన్నటివరకు లింగుస్వామికి అవకాశమిస్తాడా.. లేక విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడా అనే అనుమానం ఉండేది. ఫైనల్ గా బన్నీ ప్రాజెక్టులపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ అల్లువారబ్బాయి ఇద్దరు దర్శకులకు అవకాశమిచ్చాడు. అయితే మొదట లింగుస్వామితోనే సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకొచ్చాయి. తమిళ-తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. అంటే.. బన్నీ చేయబోతున్న స్ట్రయిట్ తమిళ సినిమా ఇదేనన్నమాట. ఆ విషయాన్ని బలంగా చెప్పాలనే ఉద్దేశంతో… సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా చెన్నైలో నిర్వహించాలనుకుంటున్నారు. మొదటి ఇంటర్వ్యూ కూడా తమిళ మీడియాకే ఇవ్వాలనుకుంటున్నారు. అలా కోలీవుడ్ లో తొలి అడుగును గ్రాండ్ గా వేయాలనేది బన్నీ ప్లాన్. మరోవైపు అల్లు అర్జున్ సినిమాలకు కేరళలో ఎలాగూ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కేవలం బన్నీ సినిమాల కోసమే ఎదురుచూసే సెక్షన్ ఒకటి సిద్ధంగా ఉంటుంది. సో… ఇకపై బన్నీ ఒక సినిమా చేస్తే అది తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే అవకాశముంది. అలా టోటల్ సౌత్ లో స్ట్రాంగ్ బేస్ ఏర్పాటుచేసుకోవాలనే ఉద్దేశంతోనే మాస్ సినిమాల దర్శకుడు లింగుస్వామికి మొదట అవకాశమిచ్చాడు. మరోవైపు ఈ సినిమా కోసం బన్నీ సరసన నటించడానికి ఓ కొత్తమ్మాయిని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Click on Image to Read:
samantha1
puri-jaganath
First Published:  11 May 2016 2:59 AM GMT
Next Story