Telugu Global
NEWS

వీరి తెలివి తేటల ముందు ప్రపంచమే ఓ వెర్రిపప్ప!

చంద్రబాబు ప్రపంచానికి పాఠాలు నేర్పించారని టీడీపీ నేతలు చెబుతుంటారు. ఆయనేమో గానీ టీడీపీ నేతలు మాత్రం ముల్లోకాలకు రాజకీయం నేర్పించేలా ఉన్నారు.  ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు చెబుతున్న మాటలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బాగోదు అంటూ బీజేపీకే వార్నింగ్ ఇస్తున్న నేతలు వారు చేయాల్సింది మాత్రం చెప్పకుండా తప్పించుకుంటున్నారు.  తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమ,  బెజవాడలో టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన కామెంట్స్ కాస్త విచిత్రంగానే ఉన్నాయి.   […]

వీరి తెలివి తేటల ముందు ప్రపంచమే ఓ వెర్రిపప్ప!
X

చంద్రబాబు ప్రపంచానికి పాఠాలు నేర్పించారని టీడీపీ నేతలు చెబుతుంటారు. ఆయనేమో గానీ టీడీపీ నేతలు మాత్రం ముల్లోకాలకు రాజకీయం నేర్పించేలా ఉన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు చెబుతున్న మాటలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బాగోదు అంటూ బీజేపీకే వార్నింగ్ ఇస్తున్న నేతలు వారు చేయాల్సింది మాత్రం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమ, బెజవాడలో టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన కామెంట్స్ కాస్త విచిత్రంగానే ఉన్నాయి.

వయసులో పెద్దవాడైన ముద్దుకృష్ణమ బీజేపీపై నిప్పులు చెరిగారు. హోదా ఇవ్వకపోయినా తాము సైలెంట్ గా ఉంటామని అనుకోవద్దని హెచ్చరించారు. ప్రత్యేక హోదా రాకుండా వెంకయ్య, అరుణ్ జైట్లీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. వెంటనే వారిద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ముద్దు… అదే కేంద్ర ప్రభుత్వంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న తమ టీడీపీ మంత్రుల గురించి మాత్రం మాట్లాడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని పార్లమెంట్ వేదికగా కేంద్రం చెప్పిన తర్వాత కూడా మంత్రి పదవులు పట్టుకుని వేలాడుతున్న టీడీపీ మంత్రులు తొలుత రాజీనామా చేయాలి గానీ… వెంకయ్య, జైట్లీ రాజీనామా ఎందుకు చేస్తారు ముద్దు కృష్ణమ సారూ…

ఇక చంద్రబాబుపై ఈగవాలితే తట్టుకోలేకపోతున్న టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరో అడుగు ముందుకేశారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుక్కొచ్చిన కొమ్ములే పవర్ ఫుల్ అన్నట్టుగా ఖాన్ తీరు ఉంది. రాష్ట్రం ముక్కలవడానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. అంతేనా బీజేపీ మతతత్వ పార్టీ అని ఆగ్రహించారు. జలీల్ ఖాన్ ఇంకా వైసీపీలోనే ఉన్నారనుకుంటున్నారో ఏమో గానీ… టీడీపీ , బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో కలిసి కాపురం చేస్తున్నాయి. అలాంటప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అయితే ఇంకా ఎందుకు కలిసున్నారో మరి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును ఎవరూ తిట్టవద్దని హెచ్చరించారు జలీల్ ఖాన్. బీజేపీని అన్ని మాటలు అనేసి చివర్లో మాత్రం కేంద్ర మంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు జలీల్ ఖాన్. ఇలా ఉంది ఏపీలో నాయకుల తీరు.

Click on Image to Read:

YS-Jagan

priyamani

arun-jaitly

ambati

pawan

IAS-Gorle-Rekha-Rani

pattipati1

drought

sv-mohan-reddy-tdp

tdp corporaters

First Published:  5 May 2016 11:25 AM GMT
Next Story