Telugu Global
Cinema & Entertainment

 సినిమాలో ప‌వ‌ర్ ఫుల్..  బ‌య‌ట  ఏంటి..?

ఒక వైపు  సినిమాలు.. మ‌రో వైపు రాజ‌కీయం రెంటితో  ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది ఒక విచిత్ర‌మైన ప‌రిస్థితి. ఎందుకంటే..సినిమాలో అసాధ్యాని సుసాధ్యం చేసే శూరుడిలా  క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంది. అది  అవాస్త‌వం. కానీ రియ‌ల్ లైఫ్ లో  జ‌న‌సేన పార్టీ అధినేత గా మాత్రం  ఏమీ చేయ‌లేక స‌త‌మ‌తం అవుతున్నాడు.  స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో  గ‌బ్బ‌ర్ సింగ్  జ‌నం ఐడియాల‌జి నుంచి పుట్టాడు. జ‌నం కోస‌మే జీవిస్తాడు.  జ‌నంలోనే జీవిస్తాడు అని  సంభాష‌ణ‌లు గ‌ట్టిగా […]

 సినిమాలో ప‌వ‌ర్ ఫుల్..  బ‌య‌ట  ఏంటి..?
X

ఒక వైపు సినిమాలు.. మ‌రో వైపు రాజ‌కీయం రెంటితో ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది ఒక విచిత్ర‌మైన ప‌రిస్థితి. ఎందుకంటే..సినిమాలో అసాధ్యాని సుసాధ్యం చేసే శూరుడిలా క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంది. అది అవాస్త‌వం. కానీ రియ‌ల్ లైఫ్ లో జ‌న‌సేన పార్టీ అధినేత గా మాత్రం ఏమీ చేయ‌లేక స‌త‌మ‌తం అవుతున్నాడు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో గ‌బ్బ‌ర్ సింగ్ జ‌నం ఐడియాల‌జి నుంచి పుట్టాడు. జ‌నం కోస‌మే జీవిస్తాడు. జ‌నంలోనే జీవిస్తాడు అని సంభాష‌ణ‌లు గ‌ట్టిగా ప‌లికాడు. కానీ రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ మాట‌లు మాత్రం అన్నివిన్న‌పాలే. ప్ర‌త్యేక ప్యాకేజి గురించి మొన్న ట్విట్ట‌ర్ లో చేసిన వ్యాఖ్య‌లు అందుకు నిద‌ర్శ‌నం.

ఇక తాజాగా సేన ప‌తి పేరుతో ప‌వ‌న్ ఒక చిత్రం చేయ‌డానికి రంగం సిద్దం అయ్యింది. ఈ చిత్రం పోస్ట‌ర్ లో తెల్ల‌టి చొక్క‌.. పంచ కట్టుకుని వెంక‌య్య నాయ‌డు గారి లా కనిపిస్తున్నాడు. చూడ‌బోతే ఇదొక పొలిటిక‌ల్ సెటైరా అన్న‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి సినిమాల్లో వీరుడిలా.. బ‌య‌ట మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అయిన జ‌న సేన‌ప‌తిలా వున్న ప‌వ‌న్ .. పొలిటిక‌ల్ సెటైర్ చేస్తే అభిమానులు ఎంత వ‌ర‌కు రిసీవ్ చేసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  3 May 2016 3:51 AM GMT
Next Story