Telugu Global
Cinema & Entertainment

ఆ పుకారు...అంద‌రినీ దూరం చేసింది!

సుప్రీమ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌లు విష‌యాల‌ను పాత్రికేయుల‌తో పంచుకున్నాడు. ఈ నెల ఐదున ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇది పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని, భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అన్నాడు. సుప్రీమ్‌లో త‌న పాత్ర క్యాబ్ డ్రైవ‌ర్ కావ‌డం వ‌ల‌న చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్‌తో పోలుస్తున్నార‌ని, విన‌డానికి బాగానే ఉన్నా, తాను స్వీక‌రించ‌డం బాగోదంటూ మోహ‌మాటం వ్య‌క్తం చేశాడు. సుప్రీం అనే పేరుని చిరంజీవి ఎంతో కృషితో సంపాదించుకున్నార‌ని, […]

ఆ పుకారు...అంద‌రినీ దూరం చేసింది!
X

సుప్రీమ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌లు విష‌యాల‌ను పాత్రికేయుల‌తో పంచుకున్నాడు. ఈ నెల ఐదున ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇది పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని, భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అన్నాడు. సుప్రీమ్‌లో త‌న పాత్ర క్యాబ్ డ్రైవ‌ర్ కావ‌డం వ‌ల‌న చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్‌తో పోలుస్తున్నార‌ని, విన‌డానికి బాగానే ఉన్నా, తాను స్వీక‌రించ‌డం బాగోదంటూ మోహ‌మాటం వ్య‌క్తం చేశాడు. సుప్రీం అనే పేరుని చిరంజీవి ఎంతో కృషితో సంపాదించుకున్నార‌ని, గ‌త సినిమాలో టైటిల్ కార్డ్స్‌లో ఆ ట్యాగ్‌లైన్‌ని త‌న‌కు ఇష్టం లేక‌పోయినా నిర్మాత‌లు వేశార‌ని, నాలుగు సినిమాల‌తో అంత పేరుని ఆశించ‌డం అత్యాశ‌ అవుతుంద‌ని సాయి ధ‌ర‌మ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

రెజీనాతో ఎఫైర్ ఉంద‌నే పుకార్ల గురించి అడగ్గా తాను వాటిని ప‌ట్టించుకోన‌ని చెప్పాడు. తాను హీరో అయ్యాక, అంత‌కుముందు త‌న‌ను ఇష్ట‌ప‌డ్డ అమ్మాయిలు అప్పుడ‌ప్పుడు ఫోన్లు చేస్తుండేవార‌ని, కానీ ఈ పుకారు వ‌చ్చాక వారంతా ఫోన్లు చేయ‌డం మానేశార‌ని, అంద‌రూ దూర‌మ‌య్యార‌ని అన్నాడు. ఇక‌పై సినిమాల వేగం పెంచుతానన్నాడు.

First Published:  1 May 2016 11:25 AM GMT
Next Story