Telugu Global
Cinema & Entertainment

నితిన్ ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్

పవన్ కల్యాణ్ ఇప్పుడు పెద్ద బిజీగా ఏం లేదు. ఇంట్లో కూర్చొని తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఎస్ జే సూర్య తో చేయబోయే సినిమాకు స్క్రీన్ ప్లే విషయంలో సలహాలు ఇస్తున్నాడు. కాబట్టి… పవర్ స్టార్ ను తన ఫంక్షన్ కు తీసుకురావడం సులభమే అనే విషయాన్ని నితిన్ బాగానే గ్రహించాడు. ఇప్పటికే పవన్ ను తన సినిమా సెట్స్ కు ఆహ్వానించిన నితిన్… పనిలో పనిగా ఆడియో ఫంక్షన్ కు కూడా రావాలని మొహమాటపెట్టాడు. […]

నితిన్ ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్
X
పవన్ కల్యాణ్ ఇప్పుడు పెద్ద బిజీగా ఏం లేదు. ఇంట్లో కూర్చొని తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఎస్ జే సూర్య తో చేయబోయే సినిమాకు స్క్రీన్ ప్లే విషయంలో సలహాలు ఇస్తున్నాడు. కాబట్టి… పవర్ స్టార్ ను తన ఫంక్షన్ కు తీసుకురావడం సులభమే అనే విషయాన్ని నితిన్ బాగానే గ్రహించాడు. ఇప్పటికే పవన్ ను తన సినిమా సెట్స్ కు ఆహ్వానించిన నితిన్… పనిలో పనిగా ఆడియో ఫంక్షన్ కు కూడా రావాలని మొహమాటపెట్టాడు. పక్కన త్రివిక్రమ్ కూడా ఉండడంతో… పవన్ కాదనలేకపోయాడు. అలా అ…ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ ను గెస్ట్ గా వచ్చేందుకు ఒప్పించారు.
ఈనెల 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగే పాటల వేడుకలో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అ…ఆ సినిమా ఆడియో పాటల్ని విడుదల చేయబోతున్నారు. పవన్ కు నితిన్ వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్ లో పవన్… గుర్రం బొమ్మ ఎక్కితే… నితిన్ కూడా తన అ..ఆ సెట్స్ లో గుర్రంబొమ్మపైన కూర్చొని ఫొటో దిగి నెట్ లో కూడా పెట్టాడు. పవన్ అంటే అంత అభిమానం. కుదిరితే తన సినిమాలో పవన్ డైలాగుల్నో, పాటల్నో పెట్టుకోవడానికి కూడా వెనకాడడు. అలాంటి పవన్ ఇప్పుడు తన సినిమా ఆడియో ఫంక్షన్ కు వస్తున్నాడంటే నితిన్ నమ్మలేకపోతున్నాడు. ఒక అభిమానిగా పవన్ ఎంత సంతోషిస్తున్నాడో… సినిమాకు బీభత్సమైన హైప్ వస్తుండడంతో నిర్మాత కూడా అంతే హ్యాపీ ఫీలవుతున్నాడు.
First Published:  22 April 2016 11:07 PM GMT
Next Story