Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమాలో విలన్ గా స్టార్ దర్శకుడు

త్వరలోనే మహేష్ బాబు-మరుగదాస్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి రాబోతోోంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే మొత్తం ఇప్పటికే పూర్తయింది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. మూవీలో విలన్ గా ఎప్పట్లానే బాలీవుడ్ కు చెందిన వ్యక్తిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి…. ఏదో ఒక భాషకు చెందిన ప్రేక్షకులకైనా తెలిసిన ముఖం అయితే బాగుంటుందని భావించారు. అలా అని రెగ్యులర్ విలన్స్ కాకుండా… ఆశ్చర్యకరంగా కనిపించేలా ఉండాలి. అందుకే […]

మహేష్ సినిమాలో విలన్ గా స్టార్ దర్శకుడు
X
త్వరలోనే మహేష్ బాబు-మరుగదాస్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి రాబోతోోంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే మొత్తం ఇప్పటికే పూర్తయింది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. మూవీలో విలన్ గా ఎప్పట్లానే బాలీవుడ్ కు చెందిన వ్యక్తిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి…. ఏదో ఒక భాషకు చెందిన ప్రేక్షకులకైనా తెలిసిన ముఖం అయితే బాగుంటుందని భావించారు. అలా అని రెగ్యులర్ విలన్స్ కాకుండా… ఆశ్చర్యకరంగా కనిపించేలా ఉండాలి. అందుకే దర్శకుడు ఎస్ జే సూర్యను మహేష్ బాబు సినిమాలో విలన్ గా ఎంపిక చేశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేయడానికి రెడీ అవుతున్న ఎస్ జే సూర్యకు ఇది నిజంగా బంపర్ ఆఫరే. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా మెప్పించాడు ఎస్ జే సూర్య. వ్యాపారి అనే సినిమా ఇప్పటికీ కొందరికి గుర్తే. అందుకే సూర్య అయితే మహేష్ కు ప్రతినాయకుడిగా బాగుంటాడని మురుగదాస్ ఫిక్స్ అయ్యాడు. ఈ ఆలోచనకు మహేష్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
First Published:  22 April 2016 11:34 PM GMT
Next Story