Telugu Global
Cinema & Entertainment

రాజమౌళితో బాలీవుడ్ స్టార్ చర్చలు

బాహుబలితో రాజమౌళి పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఇంత అద్భుతంగా గ్రాఫిక్స్ ప్రజెంట్ చేసిన దర్శకుడు ఎవడ్రా బాబూ అంటూ ప్రతి పరిశ్రమ ఆరాతీసింది. తాజాగా పద్మశ్రీతో కూడా పాపులర్ అయిపోయాడు జక్కన్న. ఈ నేపథ్యంలో… బాహుబలి పార్ట్-2 తర్వాత రాజమౌళి ఇక తెలుగులో సినిమాలు చేయడేమో అనే రూమర్ కూడా వ్యాపించింది. అయితే ఆ వార్తల్ని గతంలోనే రాజమౌళి ఖండించినప్పటికీ పుకార్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రూమర్లకు మరింత ఊతమిస్తూ తాజాగా మరో ప్రచారం షురూ […]

రాజమౌళితో బాలీవుడ్ స్టార్ చర్చలు
X
బాహుబలితో రాజమౌళి పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఇంత అద్భుతంగా గ్రాఫిక్స్ ప్రజెంట్ చేసిన దర్శకుడు ఎవడ్రా బాబూ అంటూ ప్రతి పరిశ్రమ ఆరాతీసింది. తాజాగా పద్మశ్రీతో కూడా పాపులర్ అయిపోయాడు జక్కన్న. ఈ నేపథ్యంలో… బాహుబలి పార్ట్-2 తర్వాత రాజమౌళి ఇక తెలుగులో సినిమాలు చేయడేమో అనే రూమర్ కూడా వ్యాపించింది. అయితే ఆ వార్తల్ని గతంలోనే రాజమౌళి ఖండించినప్పటికీ పుకార్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రూమర్లకు మరింత ఊతమిస్తూ తాజాగా మరో ప్రచారం షురూ అయింది. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్… రాజమౌళితో చర్చలు జరిపాడట. దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరైన సన్నీ.. అదే కోణంలో రాజమౌళితో సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చాడట. అంతేకాకుండా… ఆ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తానిని కూడా హామీ ఇచ్చాడట. బడ్జెట్ వంద కోట్లయినా ఫర్వాలేదని భరోసా ఇచ్చాడట. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే… రాజమౌళి ట్విట్టర్ ఖాతాను ఫాలో అవ్వాల్సిందే.
First Published:  18 April 2016 3:31 AM GMT
Next Story