ఇంకా పేరు పెట్టలేదు… గాసిప్స్ ఆపండ్రా బాబూ….

ప్పుడెప్పుడో ఖుషీ వచ్చింది కాబట్టి…. దానికి దగ్గరగా ఉంటుందని హుషారు అనే పేరు పెట్టేశారు. ఆ టైటిల్ కే తెగ ప్రచారం కల్పించారు. పవన్-ఎస్ జే సూర్య కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పేరు ఇదేనంటూ హుషారుగా అంతా చెప్పేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే… అసలు పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎస్ జే సూర్య చెప్పిన కథకు ఓకే చెప్పలేదు. జస్ట్ స్టోరీలైన్ మాత్రమే ఓకే చేశాడు. పూర్తి స్క్రీన్ ప్లే ఇంకా సిద్ధం కాలేదు. అది వచ్చిన తర్వాత అందులో పవన్ మార్పులు ఎలాగూ ఉంటాయి. ఆ తర్వాతే అది సెట్స్ పైకి వెళ్తుంది. సెట్స్ పైకి వెళ్లిన తర్వాతే టైటిల్ ఫిక్స్ అవుతుంది. ఇన్నాళ్లూ పవన్ చిత్రాల విషయంలో జరిగింది ఇదే. ఇకపై జరగబోయేది కూడా ఇదే. కాబట్టి… నెట్ జనాలు కొంచెం అత్యుత్సాహం తగ్గించుకుంటే మంచిదని…. ఏదో ఒక పేరును తెరపైకి తీసుకొచ్చి హంగామా చేయొద్దని పవనిజం ఫ్యాన్స్ కాస్త గట్టిగానే కోరుతున్నారు. అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ముంబయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇంతకుముందే మాటిచ్చినట్టు… అనూప్ రూబెన్స్ కు పవన్ సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చాడు. గోపాల గోపాల సినిమా తర్వాత అనూప్ కు అవకాశమిస్తాననిి పవన్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. 
Click on Image to Read:
Chiru-150-Movie,-Appearance
puri
anushka
sardar
ramcharan
srinu-vaitla-varun-tej