Telugu Global
Cinema & Entertainment

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు లెటర్

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు…నా పేరు శివ.వై.ప్రసాద్.నా మొదటి సినిమా రిలీజ్ రోజే ఇలాంటి లెటర్ రాయాల్సి రావడం నా దురదృష్టకరం..కాని తప్పడం లేదు.ఈ లెటర్ ఆలోచింపచేయడానికే తప్ప ఎవరిని కించపరచడానికి కాదు… నేను ఎడిటర్ గా,లైన్ ప్రొడ్యూసర్ గా,మరియు భీమవరం టాకీస్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నాకున్న అనుభవంతో మరియు సినిమా మీద నాకున్న పాషన్  తో “బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ ” బ్యానర్ […]

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు లెటర్
X

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు…నా పేరు శివ.వై.ప్రసాద్.నా మొదటి సినిమా రిలీజ్ రోజే ఇలాంటి లెటర్ రాయాల్సి రావడం నా దురదృష్టకరం..కాని తప్పడం లేదు.ఈ లెటర్ ఆలోచింపచేయడానికే తప్ప ఎవరిని కించపరచడానికి కాదు…

నేను ఎడిటర్ గా,లైన్ ప్రొడ్యూసర్ గా,మరియు భీమవరం టాకీస్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నాకున్న అనుభవంతో మరియు సినిమా మీద నాకున్న పాషన్ తో “బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ ” బ్యానర్ పైన ధనా ధన్ అనే చిత్రాన్ని నిర్మించాను…

మా ధనా ధన్ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ కోసం శ్రీ సాయిసుబ్రహ్మణ్యం ఫిల్మ్స్ నుండి శ్రీనివాస్ గౌడ్ గారు మమ్మల్ని సంప్రదించారు.లేటెస్ట్ గా తెలిసిన విషయం ఏంటంటే ఆయన కూడా ఒక డబ్బింగ్ సినిమా కు ప్రొడ్యూసర్ అని…ఆయన ఆఫర్ చేసిన అమౌంట్ కే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం.అదే రోజున ఏప్రిల్15న సినిమా రిలీజ్ చేద్దామని అగ్రీమెంట్లో రాసుకున్నాం..కాని అడ్వాన్సు గా ఆయన ఇచ్చిన చెక్ బౌన్సు…కమ్యూనికేషన్ లేదు..ఆఫీసు కి రాలేదు అసలు రిలీజ్ చేస్తున్నారో లేదో తెలీదు.ఈ కండిషన్ లో మిగతా ఏరియా డిస్ట్రిబ్యుటర్స్ కోసమైనా తప్పనిసరి పరిస్తితులలో మేమే పబ్లిసిటీ పోస్టర్స్ ప్రింట్ వేయించినా థియేటర్స్ దొరకలేదు…ఒక్కటికూడా!

ఇప్పుడు వాటిని తిరిగి ఇప్పించండి అని మిమ్మల్ని అడగడానికి ఈ లెటర్ రాయడం లేదు..నా లాగా రేపు మరే చిన్న నిర్మాత నష్టపోకుండా జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాను…ముఖ్యంగా ఇలా ఆఫీసులకు వెళ్లి ప్రొడ్యూసర్స్ ని చీటింగ్ చేసే మీడియేటర్స్ లేక డిస్ట్రిబ్యుటర్స్ ని బ్లాక్ లిస్టు లో పెట్టె విధానం ఉంటే మా లాంటి నిర్మాత‌లు కు ఎంతో మేలు జ‌రుగుతుంది అనేది మా అభిప్రాయం.

దెబ్బ తగిలాక మెడిసిన్ వాడే కంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా( మా) ఉద్దేశం…

మీరు పబ్లిసిటీ కోసం ఛాంబర్ లో ప్రవేశపెట్టిన ఎల్.ఎల్.పి విధానం లాగానే రిలీజ్ కి కూడా స్లాట్టింగ్ ఆప్షన్ ని ఎందుకు తీసుకురాకూడదు…సెన్సార్ పూర్తైన సినిమా సెన్సార్ సర్టిఫికేట్ మీకు సబ్మిట్ చేసిన తరువాత మీరే వాళ్లకు నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అవైలబుల్ అని చెప్తే అప్పటివరకు వెయిట్ చేయడానికి ఎవరూ వెనకాడరు అని నా నమ్మకం..ఎందుకంటే ఇప్పుడు కూడా సినిమా రెడీ అయిన తరువాత ఆ వెయిటింగ్ పీరియడ్ లోనే చాలా మంది చిన్న మరియు కొత్త నిర్మాతలు మీడియేటర్స్ చేతులలో మోసపోతున్నారు..మరియు ఇలా రిలీజ్ చేయడం వల్ల చాలా పెద్ద సినిమాలకు(మంచి సినిమాలు)కూడా నష్టం ఉండదని నా అభిప్రాయం.ఇప్పుడు వారానికి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలావరకు నాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ రాబట్టే అనేది ఇండస్ట్రీ ఎరిగిన సత్యం.అలాంటి వాళ్లకి మినిమం సపోర్ట్ ఇస్తే ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇలానే ఇంకోన్నాల్లపాటు పచ్చగా ఉంటుంది.చాలా మందికి ఉపాధి దొరుకుతుంది…

ఇది రేపు మేము నడవవలసిన దారి కాబట్టి ఇప్పుడే దీనిని శుభ్రం చేసుకోవడం మా భాద్యత.అందుకే ఈ మెసేజ్/లెటర్ ప్రిపేర్ చేసాం.ఇది కష్టం..ఇది జరగదు అనేది ఏది లేదు.రూల్స్ అనేవి మనం పద్దతిగా నడవడానికి క్రియేట్ చేసుకున్నవి.వాటి వల్ల నష్టం వస్తున్నపుడు,అందులోనే తప్పులు జరుగుతున్నప్పుడు ఒక్కసారి వాటిని కరెక్ట్ చేసుకోడం లో తప్పులేదు…..

ఆలోచించగల‌ర‌ని మ‌న‌వి….

First Published:  15 April 2016 9:00 PM GMT
Next Story