Telugu Global
Cinema & Entertainment

అడల్ట్ సినిమాకు సీక్వెల్ సిద్ధం

దాదాపు 13 ఏళ్ల కిందట వచ్చిన సినిమా బాయ్స్. అప్పట్లో ఆ సినిమాపై విమర్శలు చెలరేగాయి. మహిళలు చూడ్డానికి చాలా ఇబ్బంది పడ్డారు. అసలు శంకర్ ఏంటి ఇలాంటి సినిమా తీశాడని అంతా తిట్టుకున్నారు. మొత్తానికి బాయ్స్ సినిమా టైటిల్ కు తగ్గట్టు బాయ్స్ కే నచ్చింది. ఆ సినిమాతోనే జెనీలియా, సిద్దార్థ్ తెలుగుతెరకు పరిచయం అయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా మరోసారి వెలుగులోకి వచ్చింది. అవును.. బాయ్స్ సినిమాకు సీక్వెల్ వస్తుందట. ఈ విషయాన్ని […]

అడల్ట్ సినిమాకు సీక్వెల్ సిద్ధం
X
దాదాపు 13 ఏళ్ల కిందట వచ్చిన సినిమా బాయ్స్. అప్పట్లో ఆ సినిమాపై విమర్శలు చెలరేగాయి. మహిళలు చూడ్డానికి చాలా ఇబ్బంది పడ్డారు. అసలు శంకర్ ఏంటి ఇలాంటి సినిమా తీశాడని అంతా తిట్టుకున్నారు. మొత్తానికి బాయ్స్ సినిమా టైటిల్ కు తగ్గట్టు బాయ్స్ కే నచ్చింది. ఆ సినిమాతోనే జెనీలియా, సిద్దార్థ్ తెలుగుతెరకు పరిచయం అయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా మరోసారి వెలుగులోకి వచ్చింది. అవును.. బాయ్స్ సినిమాకు సీక్వెల్ వస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ వెల్లడించాడు. బాయ్స్ లో తమన్ కూడా నటించిన విషయం అందరికీ తెలిసిందే. బాయ్స్-2 సినిమాతో మరోసారి తామంతా కలుస్తామంటున్నాడు తమన్. అంతేకాదు… బాయ్స్ కు రెహ్మాన్ సంగీతం అందిస్తే… బాయ్స్-2కు తానే మ్యూజిక్ కొడతానంటున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, ప్రస్తుతం రోబో 2.0తో బిజీగా ఉన్న శంకర్.. బాయ్స్-2ను ఎప్పుడు పట్టాలపైకి తీసుకొస్తాడనేదే డౌట్. తమన్ మాత్రం మరో దర్శకుడితో కలిసి బాయ్స్-2 సినిమా ఉంటుందంటున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ…
First Published:  16 April 2016 8:05 AM GMT
Next Story