Telugu Global
Others

కాంగ్రెస్ ప‌రిస్థితిని ప్ర‌శాంత్ కిశోర్ మారుస్తాడా?

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికీ తాము అధికారంలోకి రాలేద‌న్న బాధ కాంగ్రెస్ పార్టీని మొద‌టి నుంచి వేధిస్తోంది. దీనికితోడు తెలంగాణ రాష్ర్ట స‌మితిలోకి త‌మ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బారులు తీరుతుండ‌టంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలోపాలు పోవ‌డం లేదు. పొన్నాల నేతృత్వంలో పార్టీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌ని వెంట‌నే ఆయ‌న్ను మార్చాల‌ని మిగిలిన నాయ‌కులు కోర‌డంతో అధిష్టానం ఆయ‌న్ను త‌ప్పించింది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్‌కు ప‌గ్గాలు అప్ప‌జెప్పింది. ఉత్త‌మ్ అందరినీ క‌లుపుకుని పోలేక‌పోతున్నారు. వ‌రంగ‌ల్ పార్లమెంటు స్థానం, […]

కాంగ్రెస్ ప‌రిస్థితిని ప్ర‌శాంత్ కిశోర్ మారుస్తాడా?
X
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికీ తాము అధికారంలోకి రాలేద‌న్న బాధ కాంగ్రెస్ పార్టీని మొద‌టి నుంచి వేధిస్తోంది. దీనికితోడు తెలంగాణ రాష్ర్ట స‌మితిలోకి త‌మ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బారులు తీరుతుండ‌టంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలోపాలు పోవ‌డం లేదు. పొన్నాల నేతృత్వంలో పార్టీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌ని వెంట‌నే ఆయ‌న్ను మార్చాల‌ని మిగిలిన నాయ‌కులు కోర‌డంతో అధిష్టానం ఆయ‌న్ను త‌ప్పించింది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్‌కు ప‌గ్గాలు అప్ప‌జెప్పింది. ఉత్త‌మ్ అందరినీ క‌లుపుకుని పోలేక‌పోతున్నారు. వ‌రంగ‌ల్ పార్లమెంటు స్థానం, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పార్టీని గెలుపు తీరాల‌కు చేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. క‌నీసం, త‌మ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్న కిష్టారెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన నారాయ‌ణ‌ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని సైతం కాపాడుకోలేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు ఉత్త‌మ్‌. దీంతో అధిష్టానం తానే స్వ‌యంగా రంగంలోకి దిగింది. కారుపార్టీపై విమ‌ర్శ‌లు పెంచాల‌ని ఆదేశాలిచ్చినా.. వాటిని అమ‌లు చేయ‌డంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. దీనికితోడు తాజాగా మ‌క్త‌ల్ ఎమ్మెల్యే రామ్మోహ‌న్‌రెడ్డి కూడా కారెక్క‌డంతో ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.
అందుకే ప్ర‌శాంత్‌ను రంగంలోకి దించారా?
రాజ‌కీయాల్లో వ్యూహ‌క‌ర్త‌గా పేరొందిన ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అడుగుపెట్టారు. తెలంగాణ‌లో పార్టీ బ‌ల‌ప‌డేందుకు అన్ని ర‌కాల అవ‌కాశాలున్నా.. రాజ‌కీయ నాయ‌కుల స‌మ‌న్వ‌య‌లోపం పార్టీలో బీసీ-ఓసీలు నిలువునా చీలిపోవ‌డంతో నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త లోపించింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌శాంత్ తెలంగాణ రాజకీయాల‌పై అధ్య‌య‌నం ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 30 మంది మెరిక‌ల్లాంటి యువ నాయ‌కుల‌కు త‌న ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ ఇప్పించాల‌న్న యోచ‌న‌లో ఉన్నారు. ఈ లెక్క‌న రాష్ట్రవ్యాప్తంగా 3,600 మంది యువ‌నాయ‌కులు కావాల‌ని కోరుతున్నారు. అధిష్టానం కూడా ప్ర‌శాంత్ అడిగిన వారి జాబితా సిద్ధం చేయాల‌ని ఉత్త‌మ్‌కు సూచించింది. తెలంగాణ‌లో ఉన్న మౌలిక స‌మ‌స్య‌ల‌పై పోరాటం జ‌రిపేందుకు వీరికి శిక్ష‌ణ ఇస్తార‌ని స‌మాచారం. ప్ర‌శాంత్ రాజ‌కీయం ఏమేర‌కు ప‌నిచేస్తుందోన‌ని పార్టీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.
First Published:  15 April 2016 1:51 AM GMT
Next Story