Telugu Global
National

ఇంద్రాణి ముఖ‌ర్జీ పెళ్లిళ్ల పై  కాదు...రైతుల బాధ‌ల గురించి రాయండి!

మ‌హారాష్ట్ర‌లో  రైతులు ఎదుర్కొంటున్న దుర్భ‌ర ప‌రిస్థితుల‌పై బాలివుడ్ విల‌క్ష‌ణ న‌టుడు నానాప‌టేక‌ర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌రువు కార‌ణంగా రైతులు తిండికి కూడా లేని స్థితిలో అల్లాడుతున్నార‌ని, మ‌న కారు డోర్‌ని కొట్టి, స‌హాయం అర్థించే వ్య‌క్తి రైతు అయ్యే అవ‌కాశం ఉందంటూ ఆయ‌న తీవ్ర‌మైన భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు క‌న్నీటి ప‌ర్యంత‌మైన నానా ప‌టేక‌ర్‌, రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో బ‌తుకుతెరువు కోసం న‌గ‌రాల‌కు వ‌ల‌స‌లు పోతున్నార‌ని, వారికిప్పుడు ఆహారం, నీరు టాయిలెట్ త‌దిత‌ర క‌నీస […]

ఇంద్రాణి ముఖ‌ర్జీ పెళ్లిళ్ల పై  కాదు...రైతుల బాధ‌ల గురించి రాయండి!
X

మ‌హారాష్ట్ర‌లో రైతులు ఎదుర్కొంటున్న దుర్భ‌ర ప‌రిస్థితుల‌పై బాలివుడ్ విల‌క్ష‌ణ న‌టుడు నానాప‌టేక‌ర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌రువు కార‌ణంగా రైతులు తిండికి కూడా లేని స్థితిలో అల్లాడుతున్నార‌ని, మ‌న కారు డోర్‌ని కొట్టి, స‌హాయం అర్థించే వ్య‌క్తి రైతు అయ్యే అవ‌కాశం ఉందంటూ ఆయ‌న తీవ్ర‌మైన భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు క‌న్నీటి ప‌ర్యంత‌మైన నానా ప‌టేక‌ర్‌, రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో బ‌తుకుతెరువు కోసం న‌గ‌రాల‌కు వ‌ల‌స‌లు పోతున్నార‌ని, వారికిప్పుడు ఆహారం, నీరు టాయిలెట్ త‌దిత‌ర క‌నీస స‌దుపాయాలు క‌ల్పించాల్సిన అవ‌సరం ఉంద‌ని అన్నారు. క‌నీసం ఒక వ్య‌క్తి ఒక రైతు బాగోగులు ప‌ట్టించుకున్నా స‌మ‌స్య తీరుతుంద‌ని ఆయ‌న అభిప్రాయప‌డ్డారు.

నానా ప‌టేక‌ర్ అహ్మ‌ద్ న‌గ‌ర్‌లో ఈ విష‌యంపై మీడియాతో మాట్లాడారు. మ‌హారాష్ట్ర‌లో క‌రువుని దృష్టిలో పెట్టుకుని అక్క‌డ ఐపిఎల్ మ్యాచ్‌ల‌ను వేరే ప్రాంతాల‌కు మార్చ‌డాన్ని మంచి విష‌యంగా పేర్కొన్నారు. మ‌న చుట్టూ ఉన్న జ‌నం ప‌డుతున్న‌ బాధల‌పై స్పందించ‌క‌పోవ‌డం కూడా నేర‌మే అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాగే మీడియా ఇంద్రాణీ ముఖ‌ర్జీ పెళ్లిళ్లు లాంటి వార్త‌ల‌పై కాకుండా ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌ల‌పై దృష్టి పెట్టాల‌ని నానాప‌టేక‌ర్ కోరారు.

First Published:  14 April 2016 11:07 PM GMT
Next Story