Telugu Global
WOMEN

అందుకే… ఆమె అక్ష‌య్ కుమార్‌కి అంత‌గా న‌చ్చింది!

బాలివుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్  మ‌హిళ‌లకు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో శిక్ష‌ణ‌నిచ్చే ఒక సంస్థ‌ని స్థాపించాడు.  శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక‌రే కుమారుడు, యువ‌సేన అధ్య‌క్షుడు ఆదిత్య థాక‌రేతో క‌లిసి ముంబ‌యిలో ఆయ‌న దీన్ని ప్రారంభించాడు.   ఆడ‌పిల్ల‌ల‌కు ఆత్మ‌ర‌క్ష‌ణ విద్యలు నేర్పుతూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నాడు.  ఇటీవ‌ల 19ఏళ్ల శ్రేయా నాయ‌క్ త‌న‌పై అత్యాచార ప్ర‌య‌త్నం చేయ‌బోయిన దుండ‌గుడిపై ఎదురుదాడి చేసి బాగా కొట్ట‌డ‌మే కాకుండా పోలీసుల‌కు ప‌ట్టించింది. శ్రేయ చూపిన ధైర్యాన్ని చూసి తాను గ‌ర్వంగా పీల‌వుతున్నానంటున్నాడు అక్ష‌య్ […]

అందుకే… ఆమె అక్ష‌య్ కుమార్‌కి అంత‌గా న‌చ్చింది!
X

బాలివుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ మ‌హిళ‌లకు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో శిక్ష‌ణ‌నిచ్చే ఒక సంస్థ‌ని స్థాపించాడు. శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక‌రే కుమారుడు, యువ‌సేన అధ్య‌క్షుడు ఆదిత్య థాక‌రేతో క‌లిసి ముంబ‌యిలో ఆయ‌న దీన్ని ప్రారంభించాడు. ఆడ‌పిల్ల‌ల‌కు ఆత్మ‌ర‌క్ష‌ణ విద్యలు నేర్పుతూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నాడు. ఇటీవ‌ల 19ఏళ్ల శ్రేయా నాయ‌క్ త‌న‌పై అత్యాచార ప్ర‌య‌త్నం చేయ‌బోయిన దుండ‌గుడిపై ఎదురుదాడి చేసి బాగా కొట్ట‌డ‌మే కాకుండా పోలీసుల‌కు ప‌ట్టించింది. శ్రేయ చూపిన ధైర్యాన్ని చూసి తాను గ‌ర్వంగా పీల‌వుతున్నానంటున్నాడు అక్ష‌య్ కుమార్‌.

thumb_060714014326ఇంత‌కీ ఆమె ఎలా ఎదుర్కొంది…..బిఎమ్ఎస్ చ‌దువుతున్న శ్రేయ సాయంత్రం ఆరున్న‌ర‌కి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా దుండ‌గుడు ఆమెని వెంబ‌డించాడు. ఆమెకి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ప‌ట్టుకోబోతుండ‌గానే శ్రేయ వేగంగా స్పందించింది. సెంట‌ర్‌లో నేర్పిన ట్రిక్కుల‌ను ప్ర‌యోగించి అత‌డి జుట్టుని ప‌ట్టుకుని మొహం మీద గుద్దింది. అప్ప‌టికే తెల్ల‌బోయిన దుండ‌గుడు త‌న‌ని వ‌దిలేయ‌మ‌ని బ్ర‌తిమ‌లాడ‌టం మొద‌లుపెట్టాడు. శ్రేయ అత‌ని కాల‌ర్‌ని దొర‌క‌బుచ్చుకుని అలాగే రోడ్డుమీద‌కు లాక్కువ‌చ్చింది. అక్క‌డ జ‌నం ఉండ‌టంతో ఆమెకు తోడుగా నిలిచారు. పావుగంట‌లో పోలీసులు వ‌చ్చి అత‌డిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. నిజానికి తాను చాలా భ‌య‌స్తురాలిన‌ని, కానీ సెంట‌ర్‌లో ఇచ్చిన శిక్ష‌ణ త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింద‌ని ఆమె తెలిపింది. అక్ష‌య్ సార్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానంది. త‌న తండ్రి పోలీస్ కంప్ల‌యింట్ వ‌ద్దన్నాడ‌ని, కానీ తాను కంప్ల‌యింట్ ఇవ్వ‌డంతో పాటు ఆ సంఘ‌ట‌న గురించి నిర్భ‌యంగా మాట్లాడుతున్నాన‌ని శ్రేయ తెలిపింది. ప్ర‌తి అమ్మాయి త‌న‌లా ఆత్మ‌ర‌క్ష‌ణ విద్య‌లు నేర్చుకుని ధైర్యంగా ఉండాల‌ని శ్రేయ కోరుతోంది.

First Published:  15 April 2016 7:15 AM GMT
Next Story