Telugu Global
Others

కోమటి బ్రదర్స్ కూడా కారెక్కుతారా ?

తెలంగాణ‌లో గులాబీపార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. కొంతకాలం పాటు స్త‌బ్దుగా ఉన్న ఈ వ్య‌వ‌హారం తాజాగా మ‌క్త‌ల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి కారెక్క‌డంతో ఈ చ‌ర్చ మ‌ళ్లీ ఊపందుకుంది. చిట్టెంతోపాటు మరి కొంత మంది కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు గులాబీ తీర్థం పుచ్చుకుంటార‌న్న ప్ర‌చారం మొద‌లైంది. ఆ నేత‌లు ఎవ‌రు? అన్న విషయంపై కాంగ్రెస్‌లో చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లో ఖ‌మ్మంలో జ‌ర‌గ‌బోయే టీఆర్ ఎస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా ప‌లు పార్టీల నుంచి […]

కోమటి బ్రదర్స్ కూడా కారెక్కుతారా ?
X

తెలంగాణ‌లో గులాబీపార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. కొంతకాలం పాటు స్త‌బ్దుగా ఉన్న ఈ వ్య‌వ‌హారం తాజాగా మ‌క్త‌ల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి కారెక్క‌డంతో ఈ చ‌ర్చ మ‌ళ్లీ ఊపందుకుంది. చిట్టెంతోపాటు మరి కొంత మంది కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు గులాబీ తీర్థం పుచ్చుకుంటార‌న్న ప్ర‌చారం మొద‌లైంది. ఆ నేత‌లు ఎవ‌రు? అన్న విషయంపై కాంగ్రెస్‌లో చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లో ఖ‌మ్మంలో జ‌ర‌గ‌బోయే టీఆర్ ఎస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా ప‌లు పార్టీల నుంచి వ‌ల‌స‌లు జోరుగా సాగ‌నున్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన ప‌లువురు నేత‌లు గులాబీ పార్టీతో ఈ విష‌య‌మై ట‌చ్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కారెక్కుతార‌న్న ప్ర‌చారం కొంత‌కాలంగా సాగుతోంది.

తొలుత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారం గ‌తేడాది జ‌రిగినా.. ఎందుక‌నో ఏమోగానీ ఆయ‌న పార్టీ మార‌లేదు. జిల్లా రాజ‌కీయాల‌పై ఈ సోద‌రుల‌కు మంచి ప‌ట్టు ఉంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే జిల్లాకి చెందిన నాయకుడు. ఉత్తమ్ తో పొసగక‌పోవటమే కారణంగా పార్టి మారవచ్చు అని ఇప్పుడంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన‌.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఓడిపోయారు. కానీ, అన్న వెంక‌ట‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. త‌రువాత ప‌లుమార్లు పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారం సాగినా.. అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి కేసీఆర్‌కు స‌వాలు విసిరారు. ఎన్నిక‌ల్లో త‌న త‌మ్ముడు ఓడిపోతే.. త‌న రాజ‌కీయ జీవితానికి శాశ్వ‌తంగా సెలవు తీసుకుంటాన‌ని శ‌ప‌థం చేసి మ‌రీ త‌న త‌మ్ముడిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వీరిద్ద‌రికి స‌ముచిత ప్రాధాన్యం ఉంది. ఇప్ప‌టికిప్పుడు త‌మ‌కు పార్టీ మారాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌. అయితే, రాజ‌కీయాలు ఎప్పుడు, ఎలా ఉంటాయో చెప్ప‌లేం క‌దా!

First Published:  14 April 2016 1:58 AM GMT
Next Story