అప్పుడు వాయిదా పడింది… ఇప్పుడు మళ్లీ వస్తోంది

శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ సినిమా చేయడం పక్కా. అయితే  ఆ సినిమాపై ఈమధ్య రూమర్లు వచ్చాయి. అందరి హీరోల్లానే వరుణ్ తేజ కూడా వైట్లకు హ్యాండ్ ఇచ్చాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే… ఉగాదికి ప్రారంభం కావాల్సిన ఆ సినిమా ఆరోజును మిస్ చేసుకుంది. దీంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై మెగా కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది. వరుణ్ తేజ-వైట్ల కాంబో ఉందని కన్ ఫర్మ్ చేసిన కాంపౌండ్… సినిమా లాంచింగ్ ను ఈనెల 27న పెట్టుకున్నామని స్పష్టంచేసింది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిపింది. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం అదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. కాజల్, నిత్యామీనన్, లావణ్య త్రిపాఠి ఇలా ఎన్నో పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ… సినిమా ప్రారంభం రోజునే హీరోయిన్ల పేర్లు బయటపెడతామని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం ఎవరు వహిస్తారనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. మెగా కాంపౌడ్ కు చెందిన కొందరు పెద్దమనుషులు… దేవిశ్రీప్రసాద్ కోసం ప్రయత్నిస్తుంటే… వైట్ల మాత్రం తమన్ నే కోరుకుంటున్నట్టు సమాచారం.