Telugu Global
National

బౌద్ధాన్ని స్వీకరించిన రోహిత్ కుటుంబం

ఇటీవల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఆత్మహత్యచేసుకున్న వేముల రోహిత్‌ తల్లి రాధిక, తమ్ముడు రాజా అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం ముంబయి దాదర్‌ సమీపంలోని చైతన్యభూమి ఆవరణలో బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంబేడ్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ పాల్గొన్న ఈ సభలో బౌద్ధ బిక్షువులు రాధిక, రాజాలచేత త్రిశరణాలను, పంచశీల సూత్రాలను పాటిస్తామని ప్రతిజ్ఞచేయించి లాంచనంగా బౌద్ధంలోకి స్వీకరించారు. ఈ సందర్భంగా రోహిత్‌ తమ్ముడు రాజా మాట్లాడుతూ మా అన్న రోహిత్‌ మతం మారలేదు […]

బౌద్ధాన్ని స్వీకరించిన రోహిత్ కుటుంబం
X

ఇటీవల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఆత్మహత్యచేసుకున్న వేముల రోహిత్‌ తల్లి రాధిక, తమ్ముడు రాజా అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం ముంబయి దాదర్‌ సమీపంలోని చైతన్యభూమి ఆవరణలో బౌద్ధమతాన్ని స్వీకరించారు.

అంబేడ్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ పాల్గొన్న ఈ సభలో బౌద్ధ బిక్షువులు రాధిక, రాజాలచేత త్రిశరణాలను, పంచశీల సూత్రాలను పాటిస్తామని ప్రతిజ్ఞచేయించి లాంచనంగా బౌద్ధంలోకి స్వీకరించారు.

rohit_vemulaఈ సందర్భంగా రోహిత్‌ తమ్ముడు రాజా మాట్లాడుతూ మా అన్న రోహిత్‌ మతం మారలేదు కానీ మనసా, వాచా బౌద్ధాన్ని ఆచరించాడని, మేమంతా బౌద్ధాన్ని స్వీకరించాలని కోరుకున్నాడని చెప్పాడు. అందువల్లే రోహిత్‌ మరణించినపుడు ఆయన అంత్యక్రియలను బౌద్ధ ఆచారాల ప్రకారం నిర్వహించామని చెప్పారు.

“హిందూమతంలోని కుల వ్యవస్థకు మేము వ్యతిరేకం. అందువల్లే కుల వ్యవస్థ ప్రసక్తిలేని బౌద్ధంలో మేము చేరుతున్నాము. కనిపించని దేవుడిమీద కన్నా కనిపించే మనిషిని గౌరవించే, మానవత్వాన్ని చూపే బౌద్ధంలోకి మారాము.

ఈ రోజు నుంచి నేను మా అమ్మ నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. అవమానాలనుంచి, రోజువారి వేదనలనుంచి ఈ రోజు నుంచి స్వేచ్ఛను పొందాము. ఏ దేవుని పేరిట మమ్మల్ని శతాబ్దాలుగా హింసిస్తున్నారో ఆ దేవుళ్ళనుంచి ఈరోజు స్వేచ్ఛను పొందాము.

కుల వ్యవస్థ సంకెళ్ళనుంచి బయటపడ్డ ఈరోజును, ఈ అంబేడ్కర్‌ జయంతి రోజును నేను మా అమ్మ ఎప్పుడూ గుర్తుంచుకుంటాం.

ఈ రోజు మేము బౌద్ధాన్ని స్వీకరించినందుకు మా అన్న రోహిత్‌ చాలా గర్వపడివుండేవాడు, చాలా సంతోషించేవాడు” అంటూ రాజా మతం మారిన సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

First Published:  14 April 2016 3:52 AM GMT
Next Story