పరువు పోయింది.. నాకే సిగ్గేస్తోంది – సీఎం

విజయవాడలో అటవీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడంలో పోలీసులు, అటవీ అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు.  చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలోని చంద్రబాబు పొలంలోనే ఎర్రచందనం దుంగలను కొందరు నిల్వ చేసిన ఘటనపై సీఎం తీవ్రంగా స్పందించారు. ”నా పొలంలోనే దుంగలను దాచారంటే ఏమనుకోవాలి.  పరువు తీస్తున్నారు. సిగ్గనిపిస్తోంది” అంటూ ఆవేదన చెందారు. అయితే చంద్రబాబు పొలంలో ఎర్రచందనం దుంగలు దాచిన విషయం అధికారులెవరికీ తెలియకపోవడం విశేషం. నిజంగా సీఎం పొలంలో ఎర్రచందనం దుంగలను దాచారా?. లేక రాయలసీమలో ఎర్రదొంగలు ఎక్కువగా ఉన్నారని తీవ్రతను తెలిపేందుకు   సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న దానిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు పొలంలోనే ఎర్రచందనం దుంగలను నిల్వ చేసి ఉంటే మాత్రం పరిపాలన  పనితీరుపై ఆందోళన చెందాల్సిందే.

Click on Image to Read:

sujay-krishna-ranga-rao

cm-ramesh

priyanka-chopra

cbn1

ambati-rambabu1

ramoji-rao sakshi

pawan123
lanco-hills

ysrcp

pawan-t-news

ysrcp-giddlur-mla

jagan12131

pawan-tdp