Telugu Global
NEWS

వార్తలను వైసీపీ ఎమ్మెల్యే ఖండిస్తారా?

వైసీపీ నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చింది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  టీడీపీలోకి వెళ్తున్నట్టు కొన్ని పత్రికల్లో  కథనాలు వచ్చాయి.  ఆయన చేరిక దాదాపు ఖాయమంటూ టీడీపీ అనుకూల పత్రికలో కథనం. అయితే అశోక్‌ రెడ్డి పార్టీలో చేరడంపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని కూడా వెల్లడించింది.  గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ […]

వార్తలను వైసీపీ ఎమ్మెల్యే ఖండిస్తారా?
X

giddalur mla ashok reddyవైసీపీ నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చింది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయన చేరిక దాదాపు ఖాయమంటూ టీడీపీ అనుకూల పత్రికలో కథనం. అయితే అశోక్‌ రెడ్డి పార్టీలో చేరడంపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని కూడా వెల్లడించింది. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఏకంగా లోకేష్‌ను కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారట.

విజయవాడలో లోకేష్‌ను కలిసిన స్థానిక నాయకులు అశోక్ రెడ్డి వస్తే పార్టీలోకి చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నే రాంబాబు బాగా పనిచేస్తున్నారని కాబట్టి కొత్తగా వైసీపీ నేతలతో ఏం అవసరం వచ్చిందని లోకేష్‌ను స్థానిక నాయకులు నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారంగా తయారయ్యే నేతలందరిని పార్టీలోకి తెస్తున్నారని ఒక నేత అభ్యంతరం వ్యక్తం చేశారట. ఒక విధంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకురావడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కొత్త వ్యక్తులను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తున్నామని… సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉండే సాధారణ వ్యతిరేకత నుంచి కూడా వైసీపీ బయటపడే వీలును టీడీపీ నాయకత్వమే కల్పిస్తోందని స్థానిక లీడర్లు వాపోయారని సమాచారం. అయితే…

గిద్దలూరు టీడీపీ నాయకుల అభ్యంతరాలను లోకేష్ లెక్క చేయలేదు. కొత్తనీరు వస్తేనే పార్టీ బలపడుతుందని … కాబట్టి పార్టీలోకి వచ్చే వారికి అభ్యంతరం చెప్పవద్దని తేల్చేశారు. అయితే టీడీపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే ముందుకెళ్తామని అన్నారు. అయితే లోకేష్ స్పందనపై టీడీపీ నేతలు అసంతృప్తితో వెనుదిరిగారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో!.

Click on Image to Read:

jagan12131

pawan-tdp

jyotula

giddi-eshwari

darmana-pawan-communist

mukesh-gujarath

chandrababu-naidu

sujana123

First Published:  12 April 2016 9:42 PM GMT
Next Story