టీన్యూస్‌లో కేసీఆర్‌ను ఆకాశానికెత్తేసిన పవన్‌ కల్యాణ్

సర్దార్‌ సినిమా విడుదల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వవన్‌ కల్యాణ్‌ … కేసీఆర్‌ చానల్ టీన్యూస్‌కు కూడా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ( సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు ముందు హిందీ, ఇంగ్లీష్  మీడియాలకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ కల్యాణ్ సర్దార్ సినిమా దెబ్బతినడంతో తెలుగు మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు.) ఈ సందర్భంగా కేసీఆర్‌ పాలనను పవన్ మెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో ” ఖబర్దార్ కేసీఆర్… తాట తీస్తా” అని హెచ్చరించిన పవన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాత్రం టీఆర్ఎస్ పాలనను ఆకాశానికెత్తేశారు. ఇంకా అనేక విషయాలు చెప్పారు.  కేసీఆర్‌ వ్యవసాయం, భూమికి ఇస్తున్న గౌరవం తనకు ఎంతగానో నచ్చిందన్నారు.

తొలి నుంచి కూడా తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మాటల్లో మర్యాద ఇవ్వడం మనసులో మాత్రం అందుకు విరుద్దంగా ఉండడం తెలంగాణ ప్రజల్లో కనిపించదన్నారు. ఏదైనా నేరుగానే ఉంటుందని అందుకు తనకు తెలంగాణ ప్రాంతమంటే ఇష్టమన్నారు. తెలంగాణ, ఆంధ్రా సంస్కృతి కలవడం లేదని చాలా ఏళ్ల క్రితమే తాను గుర్తించానన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ చాలా స్పృహలో ఉంటూ జాగ్రత్తగా నడిపారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరు తనకు ఇంకా బాగా నచ్చిందన్నారు.

ఉద్యమ సమయంలో ఒక మాట దొర్లిందని కానీ అవన్నీ మనసులో పెట్టుకోవద్దని కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజలను కోరడం తనకు ఆకట్టుకుందన్నారు. ఇంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లే సమయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయని కానీ వాటన్నింటిని తట్టుకుని కేసీఆర్‌ ముందుకెళ్లారని అందుకే ఆయనంటే తనకు గౌరవం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సరైన దారిలోనే నడుస్తున్నట్టుగా తనకు అనిపించిందన్నారు. 

Click on Image to Read:

ysrcp-giddlur-mla

jagan12131

pawan-tdp

jyotula

giddi-eshwari

darmana-pawan-communist

mukesh-gujarath

chandrababu-naidu

sujana123