Telugu Global
Cinema & Entertainment

మొన్న గ్యారేజీ... నేడు భారీ భవంతి...

జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి సారథి స్టుడియోస్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఇన్నాళ్లూ షూటింగ్ జరిగింది. స్టుడియోలో ఓ పెద్ద గ్యారేజీ సెట్ వేశారు. తాజాగా  ఈ సినిమా కోసం ఓ రిచ్ బిల్డింగ్ సెట్ కూడా వేశారు. ఇకపై షూటింగ్ ను ఈ రెండు సెట్స్ లో సైమల్టేనియస్ గా తీయాలని దర్శకుడు కొరటాల శివ నిర్ణయించాడు. ఓవైపు గ్యారేజీలో యాక్షన్ సన్నివేశాలు… మరోవైపు భారీ భవంతి సెట్ లో కుటుంబ నేపథ్యం […]

మొన్న గ్యారేజీ... నేడు భారీ భవంతి...
X

జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి సారథి స్టుడియోస్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఇన్నాళ్లూ షూటింగ్ జరిగింది. స్టుడియోలో ఓ పెద్ద గ్యారేజీ సెట్ వేశారు. తాజాగా ఈ సినిమా కోసం ఓ రిచ్ బిల్డింగ్ సెట్ కూడా వేశారు. ఇకపై షూటింగ్ ను ఈ రెండు సెట్స్ లో సైమల్టేనియస్ గా తీయాలని దర్శకుడు కొరటాల శివ నిర్ణయించాడు. ఓవైపు గ్యారేజీలో యాక్షన్ సన్నివేశాలు… మరోవైపు భారీ భవంతి సెట్ లో కుటుంబ నేపథ్యం కలిగిన సన్నివేశాల్ని ఒకేసారి పిక్చరైజ్ చేయాలని నిర్ణయించారు. పగలు గ్యారేజీలో, రాత్రిళ్లు భవంతిలో ఏకథాటిగా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత… మే మొదటి వారం నుంచి కేరళలో మరో 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో పాటలు చిత్రీకరించాలని అనుకుంటున్నారు. జనతా గ్యారేజీ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  12 April 2016 11:03 PM GMT
Next Story