చంద్రబాబు ముందే మైక్ విసిరేసిన టీడీపీ ఎంపీ

ఎంపీ మాగంటి బాబుకు మరోసారి కోపం వచ్చింది. అధికారులపై పట్టరాని కోపంతో ఊగిపోయారు.  పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూరు మండల ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అనంతరం సమీక్ష నిర్వహించారు.  చంద్రబాబు కూర్చున్న సభావేదికపై  జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ మాగంటి బాబు  మైక్‌ను విసిరేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. అయినా చంద్రబాబు చూస్తూ ఉండిపోయారని తెలుస్తోంది.  ఎంపీ తీరుపై పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము కొన్ని చర్యలు తీసుకుంటామని వాటికి కూడా అడ్డుపడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.  బహిరంగసభల్లో మాగంటి బాబు ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. చాలాసార్లు ఆయన దురుసుగా ప్రవర్తించారు.

Click on Image to Read:

ambati-rambabu1

ramoji-rao sakshi

pawan123
lanco-hills

ysrcp

pawan-t-news

ysrcp-giddlur-mla

harish-rao

jagan12131

pawan-tdp

jyotula

giddi-eshwari

darmana-pawan-communist

mukesh-gujarath