Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ కోసం కేజీల కొద్దీ బంగారం

త్వరలోనే పందో సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నందమూరి అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సన్నీలియోన్ ఐటెంసాంగ్ చేస్తోందనే వార్త గుప్పుమన్న రెండు రోజులకే… బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్త బయటకొచ్చింది. అంతకంటే ముందు గుర్రపుస్వారీ, కత్తియుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నాడన్న వార్త అభిమానుల్లో ఆనందం నింపింది. వీటికి కొనసాగింపుగా… ఇప్పుడు బాలయ్య సినిమాకు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. వందో సినిమాగా తెరకెక్కించనున్న గౌతమీపుత్ర శాతకర్ణి కోసం అచ్చంగా బంగారాన్నే […]

బాలకృష్ణ కోసం కేజీల కొద్దీ బంగారం
X

త్వరలోనే పందో సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నందమూరి అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సన్నీలియోన్ ఐటెంసాంగ్ చేస్తోందనే వార్త గుప్పుమన్న రెండు రోజులకే… బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్త బయటకొచ్చింది. అంతకంటే ముందు గుర్రపుస్వారీ, కత్తియుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నాడన్న వార్త అభిమానుల్లో ఆనందం నింపింది. వీటికి కొనసాగింపుగా… ఇప్పుడు బాలయ్య సినిమాకు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. వందో సినిమాగా తెరకెక్కించనున్న గౌతమీపుత్ర శాతకర్ణి కోసం అచ్చంగా బంగారాన్నే వాడాలని నిర్ణయించారట. సినిమాలోని ప్రతి సన్నివేశం కోసం రోల్డ్ గోల్డ్ కాకుండా…. నిజమైన బంగారాన్నే వాడాలని నిర్ణయించారట. ఈ మేరకు దర్శకుడు క్రిష్ తో బాలయ్య చర్చలు సాగించారు. బాలయ్య చెప్పినట్టు చూసుకుంటే… సినిమాకు దాదాపు 40 కేజీల వరకు బంగారం పడుతుంది. అన్ని డిజైన్లతో కలుపుకొని… దాదాపు 50 మోడళ్లు వరకు తయారుచేయించాల్సి వస్తుంది. ఈ బృహత్తర కార్యాన్ని చెన్నైకు చెందిన ఓ ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారట. గతంలో రుద్రమదేవి సినిమాకు కూడా ఒరిజినల్ బంగారాన్నే వాడారు.

First Published:  12 April 2016 10:59 PM GMT
Next Story