Telugu Global
NEWS

ఫిరాయింపులపై అంబటి సెటైర్లు

వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఒకవైపు రాజ్యాంగాన్ని నిత్యం చంపేస్తూ మరోవైపు అంబేద్కర్‌కు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పడం… నాస్తికుడు వెళ్లి గుడిలో పూజలు చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే అనర్హత వేటు పడుతుందని కానీ ఏపీలో  చంద్రబాబు అందుకు భిన్నంగా ముందుకెళ్లడం లేదా ప్రశ్నించారు. అంబేద్కర్‌పై ప్రేమ […]

ఫిరాయింపులపై అంబటి సెటైర్లు
X

వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఒకవైపు రాజ్యాంగాన్ని నిత్యం చంపేస్తూ మరోవైపు అంబేద్కర్‌కు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పడం… నాస్తికుడు వెళ్లి గుడిలో పూజలు చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే అనర్హత వేటు పడుతుందని కానీ ఏపీలో చంద్రబాబు అందుకు భిన్నంగా ముందుకెళ్లడం లేదా ప్రశ్నించారు.

అంబేద్కర్‌పై ప్రేమ ఉందంటూనే ఆయన రచించిన రాజ్యాంగానికి విరుద్దంగా పక్కపార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారని నిలదీశారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తమవాడేనంటూ చంద్రబాబు కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా అడ్డుకోవడంతో వైసీపీ నాయకత్వం విఫలమైందా అన్న ప్రశ్నకు అంబటి స్పందించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడంలో విజయవంతం అయ్యారని… అలా ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా అడ్డుకోవడంలో తాము విజయవంతం కాలేకపోయామన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్లవచ్చని.. అంతమాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం ఏమిటని అంబటి ప్రశ్నించారు.

అసలు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కోని చంద్రబాబు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు సరసమైన ధర చెల్లిస్తున్నారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఇదివరకు 20 నుంచి 30 కోట్లు ఇచ్చిన చంద్రబాబు… ఇప్పుడా ధరను 40 నుంచి 50 కోట్లకు పెంచారని అంబటి చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌ చేర్చుకుంటే పశువులను కొన్నట్టు కొంటున్నారని అరిచిన చంద్రబాబు… అదే ఏపీలో పశువుల తరహాలో ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చి కొంటున్నారో చెప్పాలన్నారు. యదేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ మరోవైపు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసే అర్హత చంద్రబాబుకు ఉందా అని అంబటి ప్రశ్నించారు.

Click on Image to Read:

pawan123


lanco-hills

ysrcp

ramoji-rao sakshi

pawan-t-news

ysrcp-giddlur-mla

harish-rao

jagan12131

pawan-tdp

jyotula

giddi-eshwari

darmana-pawan-communist

mukesh-gujarath

First Published:  13 April 2016 3:50 AM GMT
Next Story