Telugu Global
Health & Life Style

వేస‌వి చెమ‌ట‌కి… చెక్ చెబుదాం!

వేస‌విలో ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య చెమ‌ట‌. కొంత‌మందికి చెమ‌ట సాధార‌ణ‌స్థాయికంటే మ‌రింత ఎక్కువ‌గా ప‌డుతూ, న‌లుగురిలోకి వెళ్లిన‌పుడు బాగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా చ‌ర్మంపై ఇత‌ర స‌మ‌స్య‌లూ వ‌స్తాయి. కొన్ని తేలిక‌పాటి చిట్కాల‌తో ఈ అధిక‌ చెమ‌ట‌ని త‌గ్గించుకోవ‌చ్చు…అవే ఇవి- 1)ఒక చిన్న గిన్నెలో కొబ్బ‌రినూనె తీసుకుని అందులో క‌ర్పూరం వేయాలి. నానిన త‌రువాత శ‌రీరంలో చెమ‌టప‌ట్టే భాగాల్లో దాన్ని పూయాలి. స్నానం చేశాక ఈ ప‌నిచేయాలి. ముప్పావు గంట  నుండి ఒక గంట వ‌ర‌కు అలాగే […]

వేస‌వి చెమ‌ట‌కి… చెక్ చెబుదాం!
X

వేస‌విలో ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య చెమ‌ట‌. కొంత‌మందికి చెమ‌ట సాధార‌ణ‌స్థాయికంటే మ‌రింత ఎక్కువ‌గా ప‌డుతూ, న‌లుగురిలోకి వెళ్లిన‌పుడు బాగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా చ‌ర్మంపై ఇత‌ర స‌మ‌స్య‌లూ వ‌స్తాయి. కొన్ని తేలిక‌పాటి చిట్కాల‌తో ఈ అధిక‌ చెమ‌ట‌ని త‌గ్గించుకోవ‌చ్చు…అవే ఇవి-

1)ఒక చిన్న గిన్నెలో కొబ్బ‌రినూనె తీసుకుని అందులో క‌ర్పూరం వేయాలి. నానిన త‌రువాత శ‌రీరంలో చెమ‌టప‌ట్టే భాగాల్లో దాన్ని పూయాలి. స్నానం చేశాక ఈ ప‌నిచేయాలి. ముప్పావు గంట నుండి ఒక గంట వ‌ర‌కు అలాగే ఉండి, మంచినీళ్ల‌తో శుభ్రం చేసుకుంటే ఆయా భాగాల్లో అధికంగా చెమ‌ట ప‌ట్ట‌కుండా ఉంటుంది.

2)టేబుల్ స్పూను ఉప్పు తీసుకుని నిమ్మ‌ర‌సంలో క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మంతో కాస్త మ‌ర్ద‌నా చేసుకున్నా చెమ‌ట స‌మ‌స్య త‌గ్గుతుంది. చేతుల‌కు ఎక్కువ‌గా చెమ‌ట ప‌ట్టేవారికి ఇది బాగా ప‌నిచేస్తుంది.

3)చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టే శ‌రీర భాగాల్లో టీ ట్రీ ఆయిల్‌ని అప్ల‌యి చేసుకుంటే ఫ‌లితం ఉంటుంది. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుండాలి. ఈ నూనె జిడ్డు చ‌ర్మం వారికి మ‌రింత మంచిది.

4)బంగాళ దుంప చెక్కుతీసి ముక్క‌లుగా చేసుకుని చెమ‌ట అధికంగా ప‌ట్టే శ‌రీర‌భాగంపై దాని ర‌సం ఇంకేలా రుద్దినా మంచి ఫ‌లితం ఉంటుంది.

4)ప్ర‌తిరోజూ ఒక గ్లాసు ట‌మాటా ర‌సం తాగుతుంటే అధిక చెమ‌ట‌ని నివారించ‌వ‌చ్చు.

5)ద్రాక్ష‌ప‌ళ్ల‌లో యాంటీ ఆక్సిడెంటుగా ప‌నిచేసి శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ని నియంత్రించే శ‌క్తి ఉంది. వేస‌విలో వీటిని ఎక్కువ‌గా తీసుకుంటే చెమ‌ట త‌గ్గుతుంది.

6)రెండు టేబుల్ స్పూన్ల స‌హ‌జ వెనిగ‌ర్‌, ఒక టేబుల్ స్పూను యాపిల్ సైడ‌ర్‌ని క‌లుపుకుని రోజుకి మూడుసార్లు తీసుకోవాలి. అయితే భోజ‌నానికి అర‌గంట ముందుకానీ, అర‌గంట త‌రువాత కానీ దీన్ని తీసుకోవాలి.

First Published:  12 April 2016 5:11 AM GMT
Next Story