Telugu Global
Cinema & Entertainment

ప్రత్యూష సంపాదించిన డబ్బు ఏమైంది..?

చిన్నారిపెళ్లి కూతురు ఫేం ప్ర‌త్యూష బెన‌ర్జీ సంపాదించిన ల‌క్ష‌ల రూపాయ‌లు ఏమయ్యాయి. ప్రస్తుతం పోలీసుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. చిన్నచిన్న రియాల్టీ షోల ద్వారా అమె ఏకంగా 24 లక్షల రూపాయలు సంపాదించింది. తీరా ఎకౌంట్ చూస్తే 18వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంత దారుణంగా ఆమె ఎకౌంట్ లోంచి డబ్బుులు వాడేసింది ఎవరనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఏటీఎం నుంచి లక్షలకు లక్షలు డ్రా చేసింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని […]

ప్రత్యూష సంపాదించిన డబ్బు ఏమైంది..?
X
చిన్నారిపెళ్లి కూతురు ఫేం ప్ర‌త్యూష బెన‌ర్జీ సంపాదించిన ల‌క్ష‌ల రూపాయ‌లు ఏమయ్యాయి. ప్రస్తుతం పోలీసుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. చిన్నచిన్న రియాల్టీ షోల ద్వారా అమె ఏకంగా 24 లక్షల రూపాయలు సంపాదించింది. తీరా ఎకౌంట్ చూస్తే 18వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంత దారుణంగా ఆమె ఎకౌంట్ లోంచి డబ్బుులు వాడేసింది ఎవరనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఏటీఎం నుంచి లక్షలకు లక్షలు డ్రా చేసింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని ఆమె ప్రియుడే కాజేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ‌స‌భ్యుల‌ను విచారించిన పోలీసులు కీల‌క స‌మాచారం సేక‌రించార‌ని స‌మాచారం. ఐదు నెల‌లుగా ప్ర‌త్యూష అక్కౌంట్ నుంచి 24 ల‌క్ష‌ల రూపాయ‌లు డ్రా అయ్యాయి. ఇవ‌న్నీ ప్రియుడైన రాహుల్‌రాజే విత్ డ్రా చేశాడ‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు పోలీసులు. అరెస్ట‌యి ఛాతీ నొప్పి నెపంతో ఆస్ప‌త్రిలో చేరిపోయారు రాహుల్‌. అనంత‌రం ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీన్ని కోర్టు తిర‌స్క‌రించింది. రాహుల్ ఆరోగ్య పరిస్థితి వైద్యుల నివేదిక‌ల ద్వారా తెలుసుకుని, అనంత‌రం అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
First Published:  10 April 2016 12:29 AM GMT
Next Story