Telugu Global
Cinema & Entertainment

అందరికీ ఒకేసారి సెలవులిచ్చిన తారక్

ఎవరైనా సినిమాలు చేస్తే సెన్సేషన్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ బ్రేక్ తీసుకుంటే అది పెద్ద వార్త అవుతుంది. అవును… నిత్యం సెట్స్ లో గడిపేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎన్టీఆర్. షూటింగ్ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతాడు. మరీ ముఖ్యంగా జనతా గ్యారేజీ సినిమా కోసం బల్క్ గా కాల్షీట్లు కేటాయించాడు. ఆగస్ట్ 12న సినిమాను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలనే కసితో అంతా పనిచేస్తున్నారు. విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్… ఈసారి జనతా గ్యారేజీకి సెలవులు ప్రకటించాడు. […]

అందరికీ ఒకేసారి సెలవులిచ్చిన తారక్
X
ఎవరైనా సినిమాలు చేస్తే సెన్సేషన్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ బ్రేక్ తీసుకుంటే అది పెద్ద వార్త అవుతుంది. అవును… నిత్యం సెట్స్ లో గడిపేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎన్టీఆర్. షూటింగ్ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతాడు. మరీ ముఖ్యంగా జనతా గ్యారేజీ సినిమా కోసం బల్క్ గా కాల్షీట్లు కేటాయించాడు. ఆగస్ట్ 12న సినిమాను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలనే కసితో అంతా పనిచేస్తున్నారు. విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్… ఈసారి జనతా గ్యారేజీకి సెలవులు ప్రకటించాడు. ఉగాది సందర్భంగా 4 రోజులు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడు. భార్య ప్రణతి, కొడుకు అభయ్ తో నాలుగు రోజులు సరదాగా గడిపిన తర్వాత…. తిరిగి జనతా గ్యారేజీ షూట్ లో జాయిన్ అవుతాడు. ఇక అక్కడ్నుంచి సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు ఏకథాటిగా షూటింగ్ జరపాలనేది యూనిట్ ప్లాన్. ఈ 4 రోజుల గ్యాప్ లో ఎలాంటి విదేశీ పర్యటనలు, విహార యాత్రలు పెట్టుకోకుండా… ఇంట్లోనే సరదాగా గడపాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడట. కుటుంబ సభ్యులకు తప్ప, మిగతా వ్యక్తులందరికీ అపాయింట్ మెంట్సు క్యాన్సిల్ అని చెప్పేశాడు.
First Published:  6 April 2016 11:49 PM GMT
Next Story