Telugu Global
Cinema & Entertainment

నితిన్ కు పోటీగా దిగిన సాయిధర్మతేజ

మెగాహీరోలు, నితిన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ సాయిధర్మతేజ మాత్రం నితిన్ తో కయ్యానికి కాలుదువ్వాడు. బరిలో సై అంటున్నాడు. అవును… నితిన్ నటించిన అ..ఆ సినిమాకు పోటీగా సాయిధర్మతేజ… తన కొత్త సినిమా సుప్రీమ్ ను రంగంలోకి దించుతున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చేనెల 6న విడుదలవుతున్నాయి. నిజానికి తన సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా చూడాలనుకున్నాడు నితిన్. అతడి తండ్రి సుధాకర్ రెడ్డి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ తెలంగాణకే […]

నితిన్ కు పోటీగా దిగిన సాయిధర్మతేజ
X

మెగాహీరోలు, నితిన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ సాయిధర్మతేజ మాత్రం నితిన్ తో కయ్యానికి కాలుదువ్వాడు. బరిలో సై అంటున్నాడు. అవును… నితిన్ నటించిన అ..ఆ సినిమాకు పోటీగా సాయిధర్మతేజ… తన కొత్త సినిమా సుప్రీమ్ ను రంగంలోకి దించుతున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చేనెల 6న విడుదలవుతున్నాయి. నిజానికి తన సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా చూడాలనుకున్నాడు నితిన్. అతడి తండ్రి సుధాకర్ రెడ్డి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కానీ తెలంగాణకే చెందిన మరో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. తను నిర్మిస్తున్న సుప్రీమ్ సినిమాను కూడా మే6నే విడుదల చేయాలనుకుంటున్నాడు. దిల్ రాజుకు ఏపీతో పాటు తెలంగాణ థియేటర్లపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో నితిన్ అ..ఆ సినిమాకు సుప్రీమ్ గట్టిపోటీనివ్వవచ్చని భావిస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి… అ..ఆ పైనే అంచనాలు బాగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. మరి దిల్ రాజు సృష్టించిన ఈ పోటీని సాయిధర్మతేజ తట్టుకోగలడా అనేది వేచి చూడాలి.

First Published:  5 April 2016 10:51 PM GMT
Next Story