Telugu Global
Others

ద‌త్త‌న్న వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రున్నారు?

2019 ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని, తెలంగాణ‌లో తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని బ‌హిరంగ వేదికపై దత్తన్న‌ ప్ర‌క‌టించారు. దీంతో ఈ విష‌యం రెండు రాష్ట్రాల్లోనూ చ‌ర్చానీయాంశంగా మారింది. రెండు రాష్ర్టాల్లోనూ బ‌ల‌హీన‌ప‌డుతున్న వారి స్నేహానికి ఈ వ్యాఖ్య‌లు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రోవైపు పార్టీ అధిష్టానం అనుమ‌తి లేకుండా ఏ ప‌నీ త‌ల‌పెట్ట‌ని సౌమ్యుడిగా దత్తాత్రేయ‌కు మంచి పేరు ఉంది. బీజేపి అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు రావడంతో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఈ విధమైన […]

ద‌త్త‌న్న వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రున్నారు?
X
2019 ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని, తెలంగాణ‌లో తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని బ‌హిరంగ వేదికపై దత్తన్న‌ ప్ర‌క‌టించారు. దీంతో ఈ విష‌యం రెండు రాష్ట్రాల్లోనూ చ‌ర్చానీయాంశంగా మారింది. రెండు రాష్ర్టాల్లోనూ బ‌ల‌హీన‌ప‌డుతున్న వారి స్నేహానికి ఈ వ్యాఖ్య‌లు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రోవైపు పార్టీ అధిష్టానం అనుమ‌తి లేకుండా ఏ ప‌నీ త‌ల‌పెట్ట‌ని సౌమ్యుడిగా దత్తాత్రేయ‌కు మంచి పేరు ఉంది. బీజేపి అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు రావడంతో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఈ విధమైన ప్రకటన చేశారని భావిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ ఎస్‌లోకి వెళ్ల‌డం, తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌పోవడంతో వరంగల్, నారాయ‌ణ‌ఖేడ్‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాజ‌యాలతో ప్ర‌జ‌ల్లో టీడీపిపై న‌మ్మ‌కం స‌న్న‌గిల్ల‌డంతో… బీజేపీ తన‌ పాత మిత్రుడిని దూరం పెడుతోంద‌ని స‌మాచారం.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనైనా బీజేపీ- టీడీపీ పొత్తు మెరుస్తుంద‌ని రెండు పార్టీలు భావించాయి. కానీ, ఫ‌లితాలు ఎంత దారుణంగా వ‌చ్చాయో అంద‌రికీ తెలిసిందే! అప్ప‌టి నుంచే తెలుగు త‌మ్ముళ్ల‌ను బీజేపీ దూరం పెడుతూ వ‌స్తోంది. చ‌ర్చా కార్య‌క్ర‌మాలు- ఇష్టాగోష్టులు, విలేక‌రుల స‌మావేశాల్లో చోటా మోటా నాయ‌కులు మీకు మాకు రాం.. రాం.. అని చెబుతూ వ‌స్తున్నారు. అయితే, జాతీయ స్థాయి నాయ‌కుడు అందులోనూ కేంద్ర మంత్రిగా ఉన్న ద‌త్తాత్రేయ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డంలో అధిష్టానం ప్ర‌మేయం త‌ప్ప‌క ఉండి ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. టీడీపీతో అంట‌కాగితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఇప్ప‌టి నుంచే దూరం పెడుతోంద‌ని భావిస్తున్నారు. దీనికితోడు పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసే చ‌ర్య‌లపైనా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. అస‌లు ఈ నిర్ణ‌యం ఓటుకు నోటు కేసు స‌మ‌యంలోనే తీసుకోవాల్సింది.. కానీ, అప్పట్లో వెంకయ్య నాయుడు చక్రం తిప్పి వీరి మైత్రిని కాపాడిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడిపి, బీజెపీ ఒంటగిగానే పోటి చేయడం… ఆ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే టీడిపీ కన్నా ఎక్కువ ఓట్లు రావడంతో బీజేపీ పార్టీలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది మొత్తానికి కమ‌ల‌నాథులు- తెలుగు త‌మ్ముళ్ల‌ది ఇక ఎవ‌రి దారి వారిదేన‌న్న మాట‌!

Click on Image to Read:

jagan-raghuveera

saritha-nair

jyothula-nehrurayapti

revanth-jagan-k

99

gali-janardhan

5

kodali-nani

roja-final

rajamouli

First Published:  3 April 2016 11:38 PM GMT
Next Story