Telugu Global
NEWS

సతీష్‌ రెడ్డి వేదన‌ తీరేదెప్పుడు?

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఆవేశంలో చేసిన శపథం ఇప్పుడు ఆయన్ను వెంటాడుతోంది. మాసిన పొడుగాటి గడ్డం… చెదిరిపోయిన క్రాప్‌తో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటంటే… కడప జిల్లాలో సాగునీటికి చాలా ఏళ్లుగా సమస్య ఉంది. దీన్ని నివారించేందుకు వైఎస్ హయాంలో గండికోట రిజర్వాయర్‌కు నీరు తెచ్చే ప్రయ్నతాలు వేగవంతం చేశారు.  అయితే వైఎస్ చనిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]

సతీష్‌ రెడ్డి  వేదన‌ తీరేదెప్పుడు?
X

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఆవేశంలో చేసిన శపథం ఇప్పుడు ఆయన్ను వెంటాడుతోంది. మాసిన పొడుగాటి గడ్డం… చెదిరిపోయిన క్రాప్‌తో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటంటే… కడప జిల్లాలో సాగునీటికి చాలా ఏళ్లుగా సమస్య ఉంది. దీన్ని నివారించేందుకు వైఎస్ హయాంలో గండికోట రిజర్వాయర్‌కు నీరు తెచ్చే ప్రయ్నతాలు వేగవంతం చేశారు. అయితే వైఎస్ చనిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఓసారి కడపకు వెళ్లి రెండు నెలల్లో గండికోటకు నీరు తెస్తామని ప్రకటన చేశారు.

satish-reddyఅయితే బాబు చెప్పిన డెడ్‌లైన్ ఎప్పుడో గండికోటలో కలిసిపోయింది. దీంతో విపక్షాల నుంచి విమర్శల పరంపర మొదలైంది. అంతే సతీష్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ఏడాదిన్నర క్రితమే కడపలో ఒక శపథం చేసేశారు. గండికోట రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చే వరకు తాను గడ్డం తీయనని, తలనీలాలు కూడా కట్ చేయించనని శపథం చేశారు. అది జరిగి ఏడాదిన్నర దాటిపోయింది. కానీ గండికోట దరిదాపుల్లోకి కూడా నీళ్లు రాలేదు. కాలువ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. సతీష్ రెడ్డి గడ్డం మాత్రం ఏపుగా పెరుగుతూనే ఉంది.

సతీష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆయన గడ్డం కథను తలుచుకుని టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆ గండికోటకు నీళ్లు వచ్చేదెప్పుడు తమ నేతను గ్లామర్ లుక్‌తో చూసేదెప్పుడని ఫీలవుతున్నారు. అంతే మరీ మన చేతుల్లో లేని పనికి శపథాలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అందులోనూ బాబుగారిని నమ్ముకుని శపథం చేసే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి!.

Click on Image to Read:

jagan-raghuveera

ambati

rayoal

saritha-nair

nehru

aishu

india-map

dattu

jyothula-nehrurayapti

revanth-jagan-k

99

gali-janardhan

5

kodali-nani

First Published:  4 April 2016 9:52 AM GMT
Next Story