Telugu Global
Cinema & Entertainment

సరైనోడుకు పోటీగా పోలీసోడు

సరైనోడు సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే దానికి పేరడీగా, అదే టైటిల్ కు దగ్గరగా మరో సినిమా కూడా సిద్ధమైంది. అదే పోలీసోడు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్, పోలీసోడు సినిమాలో విజయ్ ఇద్దరూ పోలీసాఫీసర్లే కావడం విశేషం. అయితే తెలుగులో సరైనోడుకు పోలీసుడు సినిమా ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. ఎందుకంటే… అది సూర్య, రజనీకాంత్ సినిమా కాదు. విజయ్ కు తెలుగునాట ఫాలోయింగ్ తక్కువ. కానీ పోలీసోడు సినిమాను ఘనంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు […]

సరైనోడుకు పోటీగా పోలీసోడు
X
సరైనోడు సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే దానికి పేరడీగా, అదే టైటిల్ కు దగ్గరగా మరో సినిమా కూడా సిద్ధమైంది. అదే పోలీసోడు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్, పోలీసోడు సినిమాలో విజయ్ ఇద్దరూ పోలీసాఫీసర్లే కావడం విశేషం. అయితే తెలుగులో సరైనోడుకు పోలీసుడు సినిమా ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. ఎందుకంటే… అది సూర్య, రజనీకాంత్ సినిమా కాదు. విజయ్ కు తెలుగునాట ఫాలోయింగ్ తక్కువ. కానీ పోలీసోడు సినిమాను ఘనంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. రాజా-రాణి లాంటి సెన్సిబుల్ సినిమాను తెరకెక్కించిన ఆట్లీ… విజయ్ ను హీరోగా పెట్టి తేరి అనే సినిమా తీశాడు. ఆ మూవీనే ఇప్పుడు పోలీసోడు పేరిట దిల్ రాజు తెలుగులో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇటు సర్దార్ గబ్బర్ సింగ్, అటు సరైనోడు సినిమాలకు మధ్యలో పోలీసోడు కూడా సందడి చేయబోతున్నాడు. విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.
First Published:  2 April 2016 11:50 PM GMT
Next Story