Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజీలో కీలక మార్పు

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం కొరటాల శివ. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ముంబయి షెడ్యూల్ పూర్తిచేశారు. కొరటాల శివ దర్శకత్వంలో నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. అయితే అనుకోని విధంగా సినిమాలో ఈ కీలకమైన మార్పు చేయాల్సి వచ్చింది. జనతా గ్యారేజీ ప్రాజెక్టులోకి దేవయానిని తీసుకున్నారనేది పాత విషయమే. ఈ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. దేవయానితో హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాల్ని కూడా […]

జనతా గ్యారేజీలో కీలక మార్పు
X
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం కొరటాల శివ. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ముంబయి షెడ్యూల్ పూర్తిచేశారు. కొరటాల శివ దర్శకత్వంలో నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. అయితే అనుకోని విధంగా సినిమాలో ఈ కీలకమైన మార్పు చేయాల్సి వచ్చింది. జనతా గ్యారేజీ ప్రాజెక్టులోకి దేవయానిని తీసుకున్నారనేది పాత విషయమే. ఈ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. దేవయానితో హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాల్ని కూడా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి దేవయానిని తప్పించారట. ఆ పాత్రకు సుహాసినిని తీసుకున్నారని తెలుస్తోంది. సుహాసినితో మళ్లీ సీన్లను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఇంత సడెన్ గా దేవయానిని ఎందుకు తప్పించారనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. అయితే తాజా మార్పు వల్ల జనతా గ్యారేజీ షూటింగ్ ఇంకాస్త ఆలస్యమయ్యే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
First Published:  25 March 2016 10:50 PM GMT
Next Story