Telugu Global
Cinema & Entertainment

రోబో 2.0 అంతా లీక్...!

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రోబో 2.0 ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర ఓ సైంటిస్టు పాత్ర. ఈ నేపధ్యంలో అక్షయ్ పాత్రను చాలా డిఫరెంట్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. తనపై తానే ప్రయోగాలు చేసుకుని కాకిలాగ రూపం మారిపోయిన పాత్ర అని చెప్తున్నారు. అక్షయ్ పాత్రకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. అతడికి కాకి గెటప్ వేశారు. బ్లాక్ కలర్ డ్రెస్, పెద్ద […]

రోబో 2.0 అంతా లీక్...!
X

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రోబో 2.0 ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర ఓ సైంటిస్టు పాత్ర. ఈ నేపధ్యంలో అక్షయ్ పాత్రను చాలా డిఫరెంట్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. తనపై తానే ప్రయోగాలు చేసుకుని కాకిలాగ రూపం మారిపోయిన పాత్ర అని చెప్తున్నారు. అక్షయ్ పాత్రకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. అతడికి కాకి గెటప్ వేశారు. బ్లాక్ కలర్ డ్రెస్, పెద్ద కనుబొమ్మ‌లు, వెరైటీ కనుగడ్లు, వైట్ హెయిర్ తో చూడగానే భయం కలిగించేలా అక్షయ్ కుమార్ గెటప్ ఉంది. ఈ గెటప్ ని చూసిన వారు ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో విలన్ గెటప్ గుర్తుకు వస్తోందంటున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఎంతో ప్రిస్టిజియ‌స్ గా చేస్తున్న ఈ చిత్రం స్టిల్స్ రిలీజ్ కాకుండ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికి రోబో2.0 సినిమా స్టిల్స్ పేరుమీద ఇలా అంతరజాలంలో చక్కర కొట్టడం విశేషం మ‌రి.

First Published:  24 March 2016 4:02 AM GMT
Next Story