కళ్లు తిరిగే ఎత్తులో తెలుగు హీరోయిన్‌ పుష్‌ అప్స్‌

rejina-cas

103వ అంతస్తు. కింద చూస్తే కళ్లు తిరిగేంత హైట్. ఆ హైట్‌కు వెళ్లాక ఎవరైనా చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తారు.  వీలైతే అంచులకు వెళ్లకుండా దూరంగా ఉంటారు. తెలుగు హీరోయిన్  రెజీనా మాత్రం అలా కాదు. నిజంగా ఈ భామకు ధైర్యముందో లేక భయంతో కూడిన ధైర్యంతోనే డిసైడ్ అయిందో గానీ… 103 అంతస్తుపై అద్దాలపై ఇలా పుష్‌ అప్స్ చేసింది.  అద్దాలలో నుంచి కిందకు చూస్తూ ఎంజాయ్ చేసింది.  షికాగోలోని స్కైడెక్ షికాగో మీద రెజీనా ఈ పనిచేసింది. చివరి ఫ్లోర్‌కు వెళ్లి ఇలా విన్యాసాలు చేసింది. వీటిని ఫోటోలు కూడా తీయించుకుంది.  వాటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.   స్కైడెక్ షికాగోకు వెళ్తే చుట్టుపక్కల వ్యూ చూసి వదిలేయకుండా తనలాగే  పుష్‌ అప్స్ చేయాలని సలహా ఇచ్చింది. ఫోటోలు మాత్రం ట్వీట్ చేయడం మరిచిపోవద్దంది.

Click on Image to Read:

ananth-ambani

pawan-sardhar

pawan-chiru