అన్నయ్య షూలో సువాసన చూశా- పవన్‌

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ఆడియో ఫంక్షన్‌లో పవన్‌ తన అన్న చిరును ఆకాశానికెత్తేశారు. తనకు ఒకేఒక్క హీరో చిరంజీవిగారే అన్నారు. హీరోగా తనకు చిరంజీవి మాత్రమే కనిపిస్తారన్నారు. తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు తన అన్న, వదినే కారణమన్నారు.   చిరంజీవి ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని అన్నారు.

ఒకప్పుడు ఏం చదవాలో, ఏ చేయాలో తెలియక తింటూ ఇంట్లో పడుకునే వాడినని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన అన్నయ్య మాత్రం  పగలంతా కష్టపడి రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చేవారన్నారు. కాళ్లకు షూ తీసుకునే ఓపిక కూడా లేకుండా పడుకునేవారని అన్నారు.  ఆ సమయంలో తాను వెళ్లి షూ తీసేవాడినని పవన్ చెప్పారు. తనకు అప్పుడు షూల్లో ఒక సువాసన చూశానన్నారు. అన్నయ్య షూలో తనకు శ్రమసువాసన కనిపించేదన్నారు.

ఒక కానిస్టేబుల్ కొడుకు  ఒకటి ఊహించుకుని హీరో కావాలని అనుకుని వచ్చి ఎలాంటి అండదండ లేకుండా ఈ స్థాయికి రావడం గొప్పవిషయం అన్నారు. తనకు స్పూర్తి ప్రదాత చిరంజీవే అన్నారు. రాజకీయంగా అన్నకు నచ్చని పని చేశానని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించానని చెప్పారు. చిరంజీవి కూడా దానిని అర్థం చేసుకున్నారని అన్నారు.  తమ బంధం వేరు, రాజకీయ రంగం వేరని అన్నారు.  రాజకీయంగా అన్నయ్య పంథాలో లేకపోయినా గుండెల్లో ఉంటారన్నారు.  సమయం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో తనకు తెలుసన్నారు పవన్.

Click on Image to Read:

chiru

ananth-ambani

johny

regina

pawan-sardhar

pawan-chiru