Telugu Global
NEWS

పవన్‌ నీ నిర్ణయం కరెక్ట్‌ కాదు… అన్నగా చెబుతున్నా- సర్దార్‌ ఫంక్షన్‌లో చిరు

హైదరాబాద్‌ నోవాటెల్‌లో సర్దార్ గబ్బర్‌ సింగ్  ఆడియో ఫంక్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు… పవన్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు  చేశారు. సలహాలు ఇచ్చారు. సినిమాల్లో నటించడం మానేసే యోచన ఉందంటున్న పవన్‌ చేసిన వ్యాఖ్యలను చిరు ప్రస్తావించారు. సినిమాలకు దూరం కావాలనుకోవడం  సరైన నిర్ణయం కాదని వేదిక మీదనే చెప్పారు.  ‘’ పవన్ వ్యాఖ్యలను నేను కూడా మీడియాలో చూశా. మీరే చెప్పండి. […]

పవన్‌ నీ నిర్ణయం కరెక్ట్‌ కాదు… అన్నగా చెబుతున్నా- సర్దార్‌ ఫంక్షన్‌లో చిరు
X

హైదరాబాద్‌ నోవాటెల్‌లో సర్దార్ గబ్బర్‌ సింగ్ ఆడియో ఫంక్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు… పవన్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సలహాలు ఇచ్చారు. సినిమాల్లో నటించడం మానేసే యోచన ఉందంటున్న పవన్‌ చేసిన వ్యాఖ్యలను చిరు ప్రస్తావించారు.

సినిమాలకు దూరం కావాలనుకోవడం సరైన నిర్ణయం కాదని వేదిక మీదనే చెప్పారు. ‘’ పవన్ వ్యాఖ్యలను నేను కూడా మీడియాలో చూశా. మీరే చెప్పండి. పవన్‌ నిర్ణయం కరెక్టా?. కరెక్ట్‌ కానే కాదు. అన్నయ్యగా మీ అందరి సమక్షంలోనే పవన్‌కు మరో సలహా ఇస్తున్నా… నీవు ఏరంగంలో అయినా రాణిస్తావ్. అనుమానమే లేదు. అంతమాత్రాన ఇంత మందిని ఆనందింపచేసే రంగాన్ని దూరం చేసుకోవద్దు. నీ కెపాసిటీ నీ కంటే ఇక్కడున్న వారందరికీ తెలుసు. జోడు గుర్రాలపై స్వారీ చేసే సామర్థ్యం నీకు ఉంది. మరో రంగంలోనూ రాణించగలవు. ఇదే నా సలహా. మనసు మరో వైపు లాగుతోంది కదాని అటు వైపు వెళ్లడం తప్పులేదు. కానీ సినీ రంగాన్ని వదిలిపెట్టవద్దు. నా మాట కాదంటావని నేను అనుకోవడం లేదు” అని చిరు అన్నారు.

నేరుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ రంగాన్ని వదిలిపెట్టవద్దని చిరు సలహా ఇచ్చారు. జోడు గుర్రాలపై స్వారీ చేయవచ్చు అనడం ద్వారా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ రాణించవచ్చని సలహా ఇచ్చారు. పవన్‌ సినిమాల్లోకి రాకముందు తమ వద్దకు వచ్చి సలహా అడిగారని చిరు గుర్తు చేశారు. ఆ రోజు తనతో పాటు తన భార్య కూడా పవన్‌కు డైరెక్షన్ కంటే నటనే బాగా సరిపోతుందని సలహా ఇచ్చామన్నారు. పవన్‌ ప్రతి మొట్టు ఎదిగినప్పుడు అత్యంత ఆనందించే మొదటి వ్యక్తిని తానేనని చిరు చెప్పారు.

Click on Image to Read:

pawan-gabbar

ananth-ambani

johny

regina

pawan-sardhar

pawan-chiru

First Published:  20 March 2016 12:30 PM GMT
Next Story