సంతానం పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలు కనండి… జనాభాని పెంచండి అని ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ అవసరంలేదనట్టుగా మాట్లాడిన చంద్రబాబు మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.విజయవాడలో జరిగిన క్రీడా అవగాహణ సదస్సులో ప్రసంగిస్తూ మరోసారి కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈతరం యువత కుటుంబ నియంత్రణ పద్ధతులను పక్కన పెట్టి… ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని బాబు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుతుందని, రాష్ట్రంలో కూడా జనాభా పెరగాల్సిన అవసరం ఉందని ప్రసంగించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన కాపు రుణమేళాలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీలో జనాభా శాతం తగ్గుతోందని… మరణాల సంఖ్యతో సమానంగా జననాలు ఉన్నాయన్నారు. వచ్చే కాలానికి యువత తగ్గిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే అప్రమత్తం కావాలని చెప్పారు. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాబు అలా పిలుపునివ్వడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇద్దరికి మించి పిల్లలను కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. మరి ఆ నిబంధన తొలగిస్తారా? ఇద్దరు పిల్లలను చదవించాలంటే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు తల్లిదండ్రులు రక్తం ధారపోయాల్సి వస్తోంది. లక్షలకు లక్షలు గుంజేస్తున్నారు. మరి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారి విషయంలో ఆ ఫీజులను కనీసం లక్షల నుంచి వేలల్లోకి తెస్తారా?. డబ్బున్నోళ్లు మాత్రం ఇద్దరు పిల్లలను కనాలి. పేదోళ్లు మాత్రం ఎక్కువ మంది పిల్లలను కని బాలకార్మికులుగా అభివృద్ధిలో పాలుపంచుకోవాలా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

pawan-gabbar

babu-national-media

bonda-gorantla-1

jagan-1

botsa

jagan

mohanbabu

roja-in-assembly-bayata

jagan-roja

roja-vishnu

jagan-ktr

roja-chandrababu

jagan