బొత్స గురువు సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీ నేత, సీనియర్ రాజకీయనాయకుడు పెన్మత్స సాంబశివరావు టీడీపీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. విజయనగరంలోని అశోక్‌భవన్‌లో దాదాపు గంట పాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.  ఈ నేపధ్యంలో పెన్మత్స సైకిల్ ఎక్కుతారా అన్న ప్రచారం మొదలైంది. సాంబశివరావు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.

కేవలం మర్యాద పూర్వకంగానే కలిశామంటున్నారు. పెన్మత్స ప్రస్తుతం వైసీపీ కేంద్రపాలకమండలి సభ్యుడిగానూ ఉన్నారు.  ఒకప్పుడు బొత్ససత్యనారాయణకు రాజకీయ గురువుగా ఉండేవారు.  అనంతరం బొత్స ఎదిగిపోయారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. బొత్స సత్యనారాయణను  వైసీపీలో చేర్చుకోవడం కూడా పెన్మత్స వర్గానికి ఇష్టం లేదని చెబుతుంటారు. అయితే ఉత్తరాంధ్రలో మంచి పట్టున్న బొత్సను పార్టీలో చేర్చుకున్నారు. అయితే అశోక్ గజపతి రాజు గురించి తెలిసిన వారు మాత్రం ఇలా పార్టీ మారే వారికి మధ్యవర్థిగా ఉంటే మనస్తత్వం ఆయనది కాదంటున్నారు. కాబట్టి అశోక్ గజపతి రాజును పెన్మత్స కలిసినంత మాత్రాన అది పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకే అని భావించలేమంటున్నారు.

Click on Image to Read:

bonda-gorantla-1

jagan-1

roja-in-assembly-bayata

jagan-roja

roja

mohanbabu

roja-vishnu

jagan

jagan-ktr

roja-chandrababu

jagan

roja-rajbhavan