యాక్టర్‌నా, పొలిటీషియన్‌నా అన్న కన్ఫూజ్ నాకూ ఉంది

సర్దార్ గబ్బర్‌ సింగ్ ఆడియో ఫంక్షన్‌ వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తన పొలిటికల్ కేరీర్‌పై పవన్‌ కల్యాణ్ ఆచితూచి స్పందించారు. నేరుగా ఏవిషయం చెప్పలేకపోయారు.  తనకు రచయితగా ఉండడం ఇష్టమన్నారు. ఖుషి సినిమా టైమ్‌లోనే నాలుగైదు హిట్లు వచ్చి ఉంటే సినిమాలు మానేసేవాడినన్నారు. రచయితగా ఉండేవాడినన్నారు. అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లాలని ఉండేది కాదన్నారు. కాకపోతే ఎక్కువ సినిమాలు చేస్తుంటే తనకు విపరీతమైన అలసట వచ్చేస్తుందన్నారు.

సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయలపై దృష్టి పెడుతారా అని ప్రశ్నించగా ”అలాంటిదేమీ లేదండి… చూడాలి ఎలా జరుగుతుందో” అని అన్నారు.  జనసేన పార్టీని ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని ప్రశ్నించగా… ఆ విషయం పొలిటికల్ మీటింగ్‌లో చెబుతానని ప్రస్తుతానికి సినిమా విషయానికే పరిమితం కావాలని కోరారు.

 మరో మీడియా ప్రతినిధి ”మీరు సినిమాల్లో ఉంటారా లేక రాజకీయాల్లోకి వెళ్తారా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మీరు పొలిటిషియనా లేక ఫిల్మ్ స్టారా” అని ప్రశ్నించగా ”నాకు అదే కన్ఫూజ్‌” అంటూ సరదాగా నవ్వుతూ పవన్ వ్యాఖ్యానించారు. అన్న చిరంజీవితో కలిసి రాజకీయాల్లో పనిచేస్తారా అని ప్రశ్నించగా … సినిమా పరంగానే తాము కలిసి పనిచేస్తామన్నారు. తన అన్నతో ఎప్పటికీ కలిసే ఉంటానన్నారు.

కాపుల రిజర్వేషన్లపై ప్రశ్నించగా… ”ఆగండి.. దీన్ని పొలిటికల్ మీటింగ్ చేసేస్తున్నారు” అంటూ నవ్వుతూ సున్నితంగా సమాధానాన్ని తోసిపుచ్చారు. రాజకీయాల గురించి పొలిటికల్ మీట్‌లో వివరాలు వెల్లడిస్తానన్నారు పవన్ . పాసులు లేని అభిమానులు ఆడియో ఫంక్షన్‌కు వచ్చి ఇబ్బందులు పడవద్దని పవన్ కోరారు.

Click on Image to Read:

bonda-gorantla-1

jagan-1

botsa

jagan

mohanbabu

roja-in-assembly-bayata

jagan-roja

roja-vishnu

jagan-ktr

roja-chandrababu

jagan