Telugu Global
National

ప‌ద్దెనిమిదేళ్లు వ‌చ్చిన కొడుకుని తండ్రి పోషించ‌న‌క్క‌ర్లేదు!

తండ్రి కొడుకుని అత‌నికి 18ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు  పోషిస్తే చాల‌ని, ఆ త‌రువాత కొడుకు త‌న సొంత‌కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని గుజ‌రాత్ హైకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. మాన‌సికంగా, శారీర‌కంగా ఏ లోపంలేని కొడుకుని 18 ఏళ్లు దాటినా పోషించాల్సిన అవ‌స‌రం లేద‌ని క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్ 125ని ఉటంకిస్తూ కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. అదే కూతురు అయితే మేజ‌ర్ అయినా, ఆమె పెళ్లికి ఖ‌ర్చుపెట్టాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌కు ఉంటుంద‌ని కోర్టు పేర్కొంది. దినేష్ ఓజా అనే డాక్ట‌రు […]

ప‌ద్దెనిమిదేళ్లు వ‌చ్చిన కొడుకుని తండ్రి పోషించ‌న‌క్క‌ర్లేదు!
X

తండ్రి కొడుకుని అత‌నికి 18ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు పోషిస్తే చాల‌ని, ఆ త‌రువాత కొడుకు త‌న సొంత‌కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని గుజ‌రాత్ హైకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. మాన‌సికంగా, శారీర‌కంగా ఏ లోపంలేని కొడుకుని 18 ఏళ్లు దాటినా పోషించాల్సిన అవ‌స‌రం లేద‌ని క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్ 125ని ఉటంకిస్తూ కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. అదే కూతురు అయితే మేజ‌ర్ అయినా, ఆమె పెళ్లికి ఖ‌ర్చుపెట్టాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌కు ఉంటుంద‌ని కోర్టు పేర్కొంది.

దినేష్ ఓజా అనే డాక్ట‌రు విష‌యంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. డాక్ట‌ర్ దినేష్ త‌న భార్య నీతా నుండి విడిపోయాడు. వారికి ఒక కొడుకున్నాడు. నీతా విడాకుల అనంత‌రం త‌న‌కు, త‌న కుమారుడికి జీవితాన్ని గ‌డిపేందుకు కావ‌ల‌సిన నిర్వ‌హణా వ్యయాన్ని ఇవ్వాల్సిందిగా కోరింది. అహ్మ‌దాబాద్ ఫ్యామిలీ కోర్టు తొలుత త‌ల్లీ కొడుకుల‌కు నిర్వ‌హ‌ణా వ్య‌యం ఇవ్వాల‌ని ఆదేశించింది. ఇదే కేసులో మ‌రొక పిటీష‌న్‌పై విచార‌ణ జ‌రుపుతూ వారిద్ద‌రికి ఇచ్చే మొత్తాన్ని పెంచాల‌ని ఆదేశిస్తూ, కుమారుడికి ప‌ద్దెనిమిది ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కే తండ్రి మెయింటెనెన్స్ ఇస్తే చాల‌ని పేర్కొంది. దాంతో దినేష్, కొడుక్కి ప‌ద్దెనిమిదేళ్లు రాగానే అత‌నికి ఇచ్చే మొత్తాన్ని నిలిపివేశాడు. ఈ విష‌యంపై నీతా ఫ్యామిలీ కోర్టుకి వెళ్ల‌గా, ఆ కోర్టు, గుజ‌రాత్‌ హైకోర్టుకి వెళ్లాల్సిందిగా తెలిపింది. నీతా గుజ‌రాత్ హైకోర్టుకి వెళ్లింది. హైకోర్టు తీర్పునిస్తూ, గ‌తంలో క‌ర్ణాట‌క హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డ‌రుని ఉదాహ‌రణ‌గా చూపుతూ, తండ్రికి పిల్ల‌లను పెంచి పెద్ద‌చేసి, విద్యాబుద్దులు చెప్పించాల్సిన బాధ్య‌త ఉన్న‌ప్ప‌టికీ, కుమారుడుని, అత‌ను సొంత సంపాద‌న ప్రారంభించేంత వ‌ర‌కు పోషించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప‌ద్దెనిమిదేళ్లు వ‌చ్చేవ‌ర‌కు పోషిస్తే చాల‌ని పేర్కొంది.

First Published:  19 March 2016 2:22 AM GMT
Next Story