Telugu Global
National

క‌న్హ‌య్య లాంటి విద్యార్థి మ‌ళ్లీ పుట్ట‌కూడ‌దు!

ఇక‌పై జెఎన్‌యు విద్యార్థి నాయ‌కుడు  క‌న్హ‌య్య కుమార్ లాంటి విద్యార్థి ఒక్క‌రు కూడా క‌నిపించ‌కూడ‌ద‌ని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం  రాజ‌స్థాన్ స్కూలు సిల‌బ‌స్‌లో మార్పులు తెచ్చే యోచ‌న‌లో ఉంది.  రాష్ట్ర విద్యాశాఖా మంత్రి వాసుదేవ్ దేవ్‌నానీ  ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. పిల్ల‌ల్లో దేశ‌భ‌క్తిని నింపాలంటే పాఠ్య‌పుస్త‌కాల్లో స్వాంతంత్ర్య పోరాట యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌ను చేర్చాల‌ని ఈ మేర‌కు స్కూలు సిల‌బ‌స్‌లో భారీ మార్పులు తేచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు.  దీనిపై స్పందించిన […]

క‌న్హ‌య్య లాంటి విద్యార్థి మ‌ళ్లీ పుట్ట‌కూడ‌దు!
X

ఇక‌పై జెఎన్‌యు విద్యార్థి నాయ‌కుడు క‌న్హ‌య్య కుమార్ లాంటి విద్యార్థి ఒక్క‌రు కూడా క‌నిపించ‌కూడ‌ద‌ని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం రాజ‌స్థాన్ స్కూలు సిల‌బ‌స్‌లో మార్పులు తెచ్చే యోచ‌న‌లో ఉంది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి వాసుదేవ్ దేవ్‌నానీ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. పిల్ల‌ల్లో దేశ‌భ‌క్తిని నింపాలంటే పాఠ్య‌పుస్త‌కాల్లో స్వాంతంత్ర్య పోరాట యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌ను చేర్చాల‌ని ఈ మేర‌కు స్కూలు సిల‌బ‌స్‌లో భారీ మార్పులు తేచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. దీనిపై స్పందించిన ప్రతిపక్షాలు బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహా సభ వంటి సంస్థలకు చెందిన వ్యక్తులెవరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొనలేదని, పైగా బ్రిటీష్‌ వారికి తొత్తులుగా వ్యవహరించారని ఇప్పుడు చరిత్రను కూడా వ్రకీకరించి ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లను స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరిస్తారా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.

అంత‌కుముందు కూడా విద్యాశాఖా మంత్రి ఒక ప్ర‌క‌ట‌న‌లో స్కూలు సిల‌బ‌స్‌లో భార‌త రుషులు, సాధువుల క‌థ‌ల‌ను చేర్చ‌నున్న‌ట్టుగా పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో హేము క‌లానీ, మ‌హ‌రాజ ద‌ర్శ‌న్‌, సెయింట్ క‌న్వ‌ర్ రామ్ లాంటివారి గురించి సిల‌బ‌స్‌లో చేరుస్తున్నామ‌ని, పిల్ల‌లు వారిగురించి తెలుసుకోవాల‌ని విద్యాశాఖా మంత్రి తెలిపారు. ఇప్ప‌టికే ఎనిమిదో త‌ర‌గ‌తి ఆంగ్ల పుస్త‌కాల నుండి జాన్ కీట్స్‌, థామ‌స్ హార్డీ, విలియం బ్లేక్‌, టిఎస్ ఇలియ‌ట్, ఎడ్వ‌ర్డ్ లీర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత రచయితల ర‌చ‌న‌ల‌ను తొల‌గించి అంత‌గా పేరులేని ర‌చ‌యిత‌లు ప్రాంతీయ దృక్ప‌థంతో చేసిన ర‌చ‌న‌ల‌ను సిల‌బ‌స్‌లో చేర్చారు.

Click on Image to Read:

ysrcp-notice

roja-chandrababu

jagan

roja-rajbhavan

kejriwal

Ganesh-Joshi

roja1

dustbin

lokesh twitter

roja

speakar-kodela

jagan-roja

RSS

kodela-chandrababu-naidu-ya

narayana-vishnu

roja1

roja

jagan-pressmeet

First Published:  18 March 2016 1:03 AM GMT
Next Story