జగన్ స్టామినాపై కేటీఆర్‌ కామెంట్స్!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  సెక్షన్‌ 8 అమలు అంశాన్ని చంద్రబాబు మళ్లీ తెరపైకి తెచ్చిన వేళ కేటీఆర్‌ స్పందించారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీని  ఎదుర్కొనే సత్తా,  ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా చంద్రబాబుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాన్నిఎదుర్కొనే సత్తా లేకనే జనం దృష్టి మళ్లించేందుకు మళ్లీ సెక్షన్ 8 అంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

సెక్షన్ 8 అమలు చేయాలని కోరుతూ కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం తీర్మానాన్ని పంపడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు.  హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలు సైతం టీఆర్‌ఎస్ పాలనను మెచ్చి గుంపగుత్తగా  ఓట్లేశారని కేటీఆర్‌ చెప్పారు.  అలాంటప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముందని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని సీమాంధ్రసోదరులంతా టీడీపిని ఎప్పుడో వదిలేశారన్నారు . హైదరాబాద్ లో ప్రశాంతత చెడగొట్టి లబ్ది పొందేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపు  విషయంపై రాజ్‌నాథ్‌ సింగ్‌తో చర్చించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచాల్సిందిగా కోరామన్నారు కేటీఆర్. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ భగీరథకు కేంద్రం సాయాన్ని కోరామన్నారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిశారు.

Click on Image to Read:

roja-vishnu

jagan

ysrcp-notice

roja-chandrababu

jagan

roja-rajbhavan

roja1

 

lokesh twitter

Ganesh-Joshi

roja

speakar-kodela

jagan-roja

RSS